కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారా.. ఎక్కడైనా లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా...?  మీరు పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ ఇందులో ఏదైనా తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే మీకు sbi ఒక ఆఫర్ ను ప్రకటించింది. నిజానికి పర్సనల్ లోన్ కంటే గోల్డ్ లోన్ తీసుకోవడం చాలా ఉత్తమం. అంతే కాకుండా గోల్డ్ లోన్ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కూడా లభిస్తాయి. వడ్డీ రేటు తో పాటు ఫ్లెక్సీ రీపేమెంట్ లాంటి ప్రయోజనాలు సులువుగా పొందవచ్చు.

 

 

ఇక తాజాగా దేశీయ అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  వినియోగదారులకు ఒక గోల్డెన్ ఆఫర్ ప్రకటించింది. బంగారంపై 20 లక్షల వరకు రుణం తీసుకునే అవకాశం వినియోగదారులకు కల్పిస్తుంది. ఇక ఈ గోల్డ్ లోన్ పొందడానికి 18 సంవత్సరాల వయసు గలవారు అర్హులు. అంతేకాకుండా ఈ లోన్ తీసుకోవడానికి ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ కూడా చూపించవలసిన అవసరం లేదు. మీరు బంగారం పెట్టే విలువలో 70 శాతం వరకు మీకు లోన్ రూపంలో అందిస్తుంది ఎస్బిఐ.

 

 

ఇక అతి ముఖ్యమైన sbi గోల్డ్ లోన్ పై వడ్డీ రేటు వివరాలకు వస్తే.. సంవత్సరానికి ఎంసీఎల్ఆర్‌కు 1. 25 % ఎక్కువగా ఉంటుంది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఎస్బిఐ సంవత్సర ఎంసీఎల్ఆర్ 7‌ శాతంగా ఉంది. దీనికి అనుగుణంగా చూస్తే ఎస్బిఐ పర్సనల్ గోల్డ్ లోన్ పై వడ్డీ రేటు 8.25 శాతంగా లభిస్తుంది. అలాగే బ్యాంకు లోన్ ప్రాసెస్ మొత్తంలో 0.5% ప్రాసెసింగ్  ఫీజుగా వినియోగదారుల నుంచి  తీసుకుంటుంది. ఇక వినియోగదారులు గోల్డ్ లోన్ ఆఫర్ కింద  50వేల నుంచి 20 లక్షల వరకు లోన్ పొందవచ్చు. అలాగే ఈ లోను మొత్తం డబ్బులు మూడు ఆప్షన్లలో తిరిగి బ్యాంకు చెల్లించుకునే అవకాశాలు కల్పించింది sbi . ఇంకెందుకు ఆలస్యం ఎవరైనా గోల్డ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. అలాగే కేవలం రెండు ఫోటోలు, అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్‌ తో సులువుగా గోల్డ్ లోన్  పొందవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: