వరుస లాభాలతో దూసుకెళ్తున్న దేశీయ మార్కెట్ నేడు నష్టాల బాట పట్టింది. దీనితో బెంచు మార్కు సూచీల జోరుకు నేడు బ్రేకులు పడ్డాయి. నేడు స్టాక్ మార్కెట్ భారీగా పతనం అయింది. దీనికి కారణం ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ 6 .5 శాతం నష్ట పోవడమే ఇందుకు ప్రధాన కారణం. అంతేకాకుండా అమెరికా ఫెడరల్ రిజర్వ్ అంచనాలు సహా బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు మార్కెట్ పై వ్యతిరేక భావన చూపడంతో నేడు నష్టాల బాట పడ్డాయి. ఇక ఇంట్రాడేలో నిఫ్ట్య్ 9900 పాయింట్ల కిందకు చేరుకోగా... సెన్సెక్స్ 767 పాయింట్లు వరకు నష్టపోయింది. ఇక చివరకు రోజు ముగిసే సరికి BSE సెన్సెక్స్ 709 పాయింట్ల నష్టంతో 33538 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 214 పాయింట్ల నష్టంతో 9902 పాయింట్ల వద్ద ముగిసింది.

 

ఇక అలాగే నేటి మార్కెట్ విశేషాలకు వస్తే... నిఫ్టీ 50 లో హీరో మోటార్ కార్ప్ ఇండియా, పవర్ గ్రిడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల బాట పట్టాయి. ఇందులో అత్యధికంగా ఇండస్ ఇండ్ బ్యాంక్ నాలుగు శాతం మేర లాభాల బాట పట్టింది. అలాగే భారతి ఇంఫ్రాటెల్, ఎస్బిఐ, సన్ ఫార్మా, టాటా మోటార్స్, జి ఎంటర్టైన్మెంట్.. షేర్లు నష్టాల బాట పట్టాయి. ఇందులో అత్యధికంగా భారతి ఇంఫ్రాటెల్ 9 శాతం మేర నష్టపోయింది.

 

ఇక అమెరికా డాలర్ తో పోలిస్తే భారత రూపాయి మారక విలువ 19 పైసల నష్టంతో 75.78 వద్ద ట్రేడ్ జరుగుతోంది. ఇక అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరింత తగ్గాయి. ఇందులో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్ కు మూడు శాతం పైగా తగ్గి 40. 47 డాలర్లకు చేరుకుంది.కాలాగే WTA ముడిచమురు ధర కూడా 1.22 శాతం నష్టపోయి 38 39 డాలర్లకు చేరుకుంది. మొత్తానికి ఈ రోజు అన్ని రంగాలలో స్టాక్ మార్కెట్ పూర్తిగా నష్టపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: