లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఒక్క పైసా కూడా పెరగని పెట్రోల్ ధర అన్ లాక్ మొదలైనప్పటి నుంచి రోజురోజుకు పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతం పెరిగి పోతున్నాయి. అన్ లాక్ 1.0 మొదలైనప్పటి నుంచి మొదటి రోజు నుంచి వరుసగా ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు కూడా ధరలు పెరిగాయి. గురువారం నాడు ఒక రోజు లీటరుపై ఏకంగా 60 పైసలు వరకు పెట్రోల్ ధరలను పెంచుతున్నట్లు ప్రభుత్వ చమురు కంపెనీలు తెలియజేశాయి. దీంతో ఈ రోజు వరకు పెట్రోల్ ఏకంగా రూ. 3. 31 వరకు పెరిగింది.

 


అంతర్జాతీయ మార్కెట్లో రోజురోజుకీ ముడి చమురు ధర తగ్గుతున్నప్పటికీ దేశీయ చమురు సంస్థలు మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను రోజురోజుకీ పెంచుతూనే ఉన్నాయి. రోజువారీ జరిగే సమీక్ష భాగంలో ఈ విధంగానే ఈ రోజు లీటర్ పెట్రోల్ పై 57 పైసలు పెంచుతూ... అలాగే డీజిల్ పై 59 పైసలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైదరాబాదులో పెట్రోల్ ధర రూ. 77.41 అలాగే డీజిల్ ధర కూడా చేరుకుంది. ఇక దీంతో దేశంలో ఇంధన ధరలు ఎప్పుడూ లేనంతగా నాలుగున్నర నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. గత నాలుగైదు రోజుల్లో పెట్రోల్ పై రూ. 3.31  అలాగే డీజిల్ ధర మీద 3.42 పైసలు పెరిగాయి. దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం గత నెలలో లీటర్ పెట్రోల్ పై ఏకంగా పది రూపాయలు అలాగే డీజిల్ పై రూ. 13 పెంచింది. దీని ప్రభావం నేరుగా పెంచలేక రోజుకు ఇంతగా పెంచుతూ వస్తున్నారు. ఇకపోతే నేటి పెట్రోల్ ధరలు వివిధ నగరాల్లో ఇలా ఉన్నాయి.

 


న్యూఢిల్లీ- పెట్రోల్‌ రూ.74.57, డీజిల్‌ రూ.7.21 , చెన్నై- పెట్రోల్‌ రూ.78.47, డీజిల్‌ రూ.71.14 , ముంబై- పెట్రోల్‌ రూ.81.53, డీజిల్‌ రూ.71.48, గుర్‌గావ్‌- పెట్రోల్‌ రూ.73.76, డీజిల్‌ రూ.65.82, బెంగళూరు- పెట్రోల్‌ రూ.76.98, డీజిల్‌ రూ.69.22 గా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: