టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ క్రెడిట్ కార్డుల వినియోగం నానాటికీ పెరుగుతూ వస్తోంది. క్రెడిట్ కార్డ్స్ వల్ల ఇన్‌స్టంట్ క్రెడిట్, నో కాస్ట్ ఈఎంఐ, రివార్డ్ పాయింట్లు, క్యాష్ బ్యాక్, డిస్కౌంట్స్, ఎక్స్‌క్లూజివ్ ఆఫర్స్ వంటి బెనిఫిట్స్ పొందొచ్చు అని తెలిపారు. అయితే క్రెడిట్ కార్డులను ఇస్టానుసారంగా ఉపయోగిస్తే మాత్రం ఇబ్బందులు పడాల్సి ఉండొచ్చునన్నారు.

 

 

క్రెడిట్ కార్డు బిల్లును సులభంగా చెల్లించేందుకు ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. క్రెడిట్ కార్డు బిల్లును లోన్ రూపంలోకి కూడా మార్చుకొని, దాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించవచ్చునన్నారు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లిస్తూ వస్తే క్రెడిట్ స్కోరుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదన్నారు. లేదంటే మాత్రం సిబిల్ స్కోర్ తగ్గిపోతుందని తెలియజేశారు.

 

 

కార్డు బిల్లు మొత్తాన్ని గడువు తేదీలోగా చెల్లిస్తే ఎలాంటి వడ్డీ పడదని తెలియజేశారు. ఒకవేళ క్రెడిట్ కార్డు బిల్లు మొత్తాన్ని ఈఎంఐ రూపంలో మార్చుకోవాలంటే వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అందువల్ల అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగిలిన సందర్భాల్లో ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవడం అంత తెలివైన నిర్ణయం కాదని తెలియజేశారు.

 

 

వడ్డీ రేట్లు అనేవి బ్యాంక్ ప్రాతిపదికన మారతాయన్నారు. మీ లోన్ టెన్యూర్ ఆధారంగా కూడా వడ్డీ రేటులో మార్పు ఉంటుందన్నారు. లోన్ టెన్యూర్ ఎక్కువగా ఉంటే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుందన్నారు. క్రెడిట్ కార్డు బిల్లును ఈఎంఐగా మార్చుకోవడానికి సాధారణంగా బ్యాంకులు లేదా క్రెడిట్ కార్డు సంస్థలు 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు లోన్ టెన్యూర్ అందిస్తారన్నారు.

 

 

క్రెడిట్ కార్డు బిల్లు కట్టడానికి పర్సనల్ లోన్ లేదా టాపప్ లోన్స్ తీసుకోవడం ఉత్తమం అన్నారు. క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లతో పోలిస్తే వీటిపై వడ్డీ రేటు తక్కువగా ఉంటుందన్నారు. అందువల్ల అందుబాటులోకి ఆప్షన్లను వినియోగించుకోండి. అలాగే కొన్ని బ్యాంకులు, క్రెడిట్ కార్డు సంస్థలు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయవన్నారు. కానీ కొన్ని మాత్రం వసూలు చేస్తాయని తెలుసుకోవాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: