కొవిడ్-19 వ్యాధి పుణ్యమా అంటూ ప్రపంచవ్యాప్తంగా హ్యాండ్ శానిటైజెర్లు, మాస్కులు తయారుచేసే పరిశ్రమలు ఎక్కువైపోయాయి. రంగు రంగుల మాస్కులను తయారుచేసే పరిశ్రమలు కూడా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అయితే భవిష్యత్తులో కొవిడ్-19 వ్యాధి ని ఎదుర్కొనేందుకు ఇప్పటివరకు ప్రజలెవరూ చూడని సరికొత్త వస్తువులు తయారు కాబోతున్నాయి అని తెలుస్తుంది. ఇందులో భాగంగానే వెల్‌స్పన్‌ గ్రూప్స్ సంస్థ వెల్‌స్పన్‌ ఫ్లోరింగ్‌ అనే సరికొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టింది. ఈ వెల్‌స్పన్‌ ఫ్లోరింగ్‌ పరిశ్రమ... భౌతిక దూరం ప్రజలకు అలవాటు ఉద్దేశంతో నేలపై పరిచే తివాచీలను స్పాటియం 6 కార్పెట్స్ అనే పేరుతో ప్రత్యేకంగా తయారు చేస్తుంది.


'ప్రజలు భౌతిక దూరాన్ని పాటించేలా ప్రత్యేకమైన తివాచీలను తయారు చేస్తున్నాం. ఈ తివాచీల డిజైనింగ్ ఒక వ్యక్తి మరొక వ్యక్తి దగ్గరికి వెళ్లేందుకు వీలు లేకుండా ఉండేలా తయారు చేయబడ్డాయి. ఆఫీసులో డెస్క్ దగ్గర పనిచేసేవారి కింద పరిచే తివాచీల రంగు, ప్యాట్రన్(నమూనా) మార్చాము. ఈ నమూనా అందరి ఉద్యోగులను ఒకరికి మరొకరు దూరంగా ఉండేలా చేస్తుంది', అని వెల్‌స్పన్‌ ఫ్లోరింగ్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ముఖేష్ సెల్వాని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే భౌతిక దూరం నిబంధనను అలవాటు చేసే ఫ్లోరింగ్ కార్పెట్స్ లను కొనుగోలు చేసేందుకు లక్షల మంది ప్రజలు ఆర్డర్లు పెట్టారట. ఫ్లోర్ పై వైరస్ ని ఎక్కువ కాలం బతకనివ్వకుండా చేసే కార్పెట్స్ ని కూడా తయారు చేసే యోచనలో ఉన్నామని వెల్‌స్పన్‌ ఫ్లోరింగ్‌ ఎగ్జిక్యూటివ్ ముఖేష్ సెల్వాని చెప్పుకొచ్చాడు.

 

కొవిడ్-19 కారణంగా ఫ్లోరింగ్ లలోనూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. రెస్టారెంట్లలో హోటళ్లలో, మందిరాలలో, వర్కర్ స్టేషన్లలో ఒకరికి ఒకరు భౌతిక ద్వారానే పాటించేలా ఈ ఫ్లోరింగ్ డిజైన్ లు రూపొందించబడతాయి. గోడలకు వేసే పెయింట్స్ లలో కూడా యాంటీవైరస్ కెమికల్స్ ని కలగలిపి తయారు చేస్తున్నామని పెయింటింగ్ సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: