కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో కఠినమైన లాక్ డౌన్ ఆంక్షలను, నిబంధనలను అమలు చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. మన దేశంలో కూడా గత మూడు నెలలుగా లాక్ డౌన్ అమలవుతుంది. ఈ లాక్ డౌన్ కారణంగా రైతులు, వ్యాపారులు, కార్మికులు, ఉద్యోగులు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు ఆర్థికంగా బాగా నష్టపోయారు. కానీ పార్లే జీ బిస్కెట్ కంపెనీ మాత్రం ఎవరూ ఊహించలేని స్థాయిలో లాభపడి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.


కరోనా వైరస్ విజృంభణ కు ముందు పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్స్ ని చాలా తక్కువమంది కొనేవారు. కానీ ఎప్పుడైతే కరోనా వైరస్ ప్రపంచ నలుమూలల వ్యాపించడం ప్రారంభించినదో... ఆ రోజు నుండి పార్టీ జీ బిస్కెట్ కంపెనీ కి బాగా కలిసి రావడం ప్రారంభమైంది. లాక్ డౌన్ విధించడంతో సొంత ఇంటికి దూరంగా ఉంటూ వేరే ప్రదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులు, వలస కార్మికులు, విద్యార్థులు ఇలా ఎందరో నిత్యావసర సరుకులు అందుబాటులో లేక తమ ఆకలిని పార్లే జీ బిస్కెట్లతో తీర్చుకోవడం ప్రారంభించారు. 


పార్లే జీ బిస్కెట్ తో తినడానికి కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఓ 10 బిస్కెట్లు తిని గ్లాసుడు మంచి నీళ్లు తాగి బతికిన వారు ఎందరో ఉన్నారు. పేద వారికి దానం చేసే దాతలు కూడా ఎక్కువగా పార్లే జీ బిస్కెట్ లను కొనుగోలు చేశారు. దీంతో ఒక్కసారిగా పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్ లకు డిమాండ్ పెరిగిపోయింది. ఫలితంగా ఆ సంస్థ సరకు రికార్డు స్థాయిలో అమ్ముడుపోగా... వారికి కోట్లలో లాభాలను వచ్చి పడ్డాయి. భారతదేశంలోని బిస్కెట్ మార్కెట్ షేర్ లో తమ కంపెనీ వాటా 5 శాతం పెరిగినట్టు పార్లేజీ క్యాటగిరీ హెడ్‌ మయాంక్‌ షా చెబుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మార్చి ఏప్రిల్ మే నెలల్లో పార్లే జీ బిస్కెట్ విక్రయాలు విపరీతంగా పెరిగిపోయాయని, బ్రెడ్ కొన లేని వారు కూడా పార్లే జీ బిస్కెట్ కొనగలరని మయాంక్‌ షా చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా కరోనా దయవలన 40 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు పార్లే జీ బిస్కెట్ సంస్థ లాభాలతో దూసుకెళ్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: