సొంత ఇంటి కల ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొత్త ఇల్లు కట్టుకోవాలి అంటే ఇప్పటికి ఎంతోమంది మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటి వారికీ ఒక అద్భుతమైన శుభవార్త.. అది ఏంటి అంటే? ఐసీఐసీఐ హోమ్ ఫైనాన్స్ కంపెనీ తాజాగా సరల్ పేరుతో ఓ అద్భుతమైన హోమ్ లోన్ స్కీమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 

 

ఈ స్కీమ్ తో పట్టన ప్రాంతాలు సహా అన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇల్లు కట్టుకోవడానికి ఈ హౌసింగ్ లోనే అందిస్తున్నట్టు ఐసీఐసీఐ తెలిపింది. మహిళలు, తక్కువ ఆదాయం కలిగిన వరు, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వారికీ లోన్ ప్రొడక్టును రూపొందించాలి అని పేర్కొన్నారు. ఐసీఐసీఐ హోమ్ లోన్ పై 7.98 శాతం వడ్డీ రేటు ప్రారంభం అవుతుంది. 

 

సరల్ స్కీమ్ ద్వారా రూ.35 లక్షల వరకు లోన్ తీసుకునే అవకాశం ఉంది. ఇంకా ఆ లోనే ని 20 ఏళ్లలోపు తిరిగి చెల్లించాలి. అంతేకాదు ఇప్పటికే లోన్ తీసుకున్న వారు కూడా కూడా ఆ డబ్బును ఐసీఐసీఐకి ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉంది. 6 లక్షలు కంటే తక్కువ ఆదాయం ఉన్న మహిళలకు వడ్డీ రేటుపై కొంత రాయితీ కూడా లభిస్తుంది. 

 

ఇంకా ఈ సరళ స్కీమ్ కింద ఋణం తీసుకున్న వారికీ రూ.2.67 లక్షల వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద మార్చి 31, 2021 వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుంది. మరి ఇంకేందుకు ఆలస్యం.. పూర్తి వివరాల కోసం ఐసీఐసీఐ బ్రాంచ్‌కు వెళ్లి సంప్రదించండి.                                            

మరింత సమాచారం తెలుసుకోండి: