బంగారం ఆకాశాన్ని తాకుతుంది.. ఏ నేను మాత్రం తక్కువ? నేను కూడా తాకుతా అని పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. వినడానికి ఎలా ఉందో కానీ తులం బంగారం ధర 50 వేలరూపాయిలు అయ్యింది. ఇంకా అలానే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. 

 

రోజుకు 50 పైసలు, 60 పైసలు పెరుగుదలతో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాగే కొనసాగితే ఇంకొ 20 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు వంద రూపాయిలు అవుతాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయిని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.    

 

IHG

 

కాగా ఈరోజు ఆదివారం లీటరు పెట్రోల్ ధర 59 పైసలు పెరుగుదలతో రూ.82.06 పైసలకు, డీజిల్ ధర 66 పైసలు పెరుగుదలతో రూ.76.91పైసాలకు చేరింది. ఇంకా అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే కొనసాగుతుంది. పెట్రోల్‌ ధర 53 పైసలు పెరుగుదలతో రూ.81.79కు, డీజిల్‌ ధర కూడా 64 పైసలు పెరుగుదలతో రూ.75.88కు చేరింది. 

 

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధర 65 పైసలు పెరుగుదలతో రూ.78.41కు, డీజిల్ ధర కూడా 64 పైసలు పెరుగుదలతో రూ.76.43కు చేరింది. ఇలా గత 13 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయ్. అయితే కరోనా నియంత్రణకై మొదలైన లాక్ డౌన్ లో స్థిరంగా ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పుడు కేవలం 13 రోజుల్లోనే 7 రూపాయిలు పెరిగింది.                                

మరింత సమాచారం తెలుసుకోండి: