పెట్రోల్, డీజిల్ ధరలు 100 రూపాయిలు అయ్యే వరకు ఆగేలా లేవు. రోజు రోజుకు భారీగా పెరిగిపోతూనే ఉన్నాయ్ ఈ పెట్రోల్, డీజిల్ ధరలు. మూడు చమురు ధర భారీగా తగ్గిన సరే పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే నేడు మళ్లీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి.. నేడు హైదరాబాద్‌‌లో శనివారం లీటరు పెట్రోల్ ధర 26 పైసలు పెరుగుదలతో రూ.83.44కు, డీజిల్ ధర 21 పైసలు పెరుగుదలతో రూ.78.57కు చేరాయి. ఇంకా ఇలానే అమరావతిలో కూడా కొనసాగుతుంది. నేడు అమరావతిలో పెట్రోల్ ధర 24 పైసలు పెరుగుదలతో 83.77 రూపాయలకు చేరింది. 

 

ఇంకా అలానే డీజిల్‌ ధర కూడా 19 పైసలు పెరుగుదలతో రూ.78.86కు చేరింది. ఇక విజయవాడలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 25 పైసలు పెరుగుదలతో రూ.83.38కు, డీజిల్ ధర 20 పైసలు పెరుగుదలతో రూ.78.50కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి. 

 

అయితే పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తున్నాయి. ఇంకా అంతర్జాతీయ మార్కెట్ లోను ముడి చమురు ధరల ప్రతిపాదన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గుతూ ఉంటాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఒక రోజు పెరగొచ్చు.. మరో రోజు తగ్గొచ్చు. మరి ఇప్పుడు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత తగ్గుతాయో చూడాలి.                                                       

మరింత సమాచారం తెలుసుకోండి: