కరోనా వైరస్ ప్రపంచాన్ని ఆర్ధికంగా ఎంత నష్టం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు పెరగడం.. కంపెనీలు ఘోరంగా నష్టపోవడం వల్ల ఎంతోమంది మధ్యతరగతి ప్రజల ఉద్యోగాలు పోయి.. ఆర్ధికంగా నష్టపోయారు. ఇంకా అలాంటి వారు ఎంతోమంది ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నారు. 

 

అయితే బయట ఎవరు అప్పు ఇవ్వలేరు. ఇంకా అలాంటి సమయంలో అప్పు అవసరం. కానీ ఇచ్చేవారు లేరు.. కాబట్టి బ్యాంకు నుంచి పర్సనల్ లోన్ తీసుకోవాలి అని అనుకునేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అయితే అలా పర్సనల్ లోన్స్ తీసుకోవాలి అని అనుకునే వారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వడ్డీ రేట్ల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఇంకా కొన్ని అంశాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి.. అప్పుడే ఇబ్బందులు ఉండవు. 

 

తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ తీసుకోవాలి అంటే మీ క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉండేలి. అయితే మీ క్రెడిట్ స్కోర్ మీ పేమెంట్స్ పై ఆధారపడి ఉంటుంది. 

 

రీపేమెంట్ ట్రాక్స్ రికార్డ్ బాగుండేలా చూసుకోండి. అంటే మీరు తీసుకున్న వాటికీ ప్రతి నెల రీపేమెంట్ ట్రాక్స్ రికార్డ్ కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల రుణాలు సులభంగా అందుతాయి. 

 

లోన్ తీసుకునే ముందు ఏ బ్యాంకులో వడ్డీ రేటు తక్కువ ఇస్తుందో చూసుకొని ఆ బ్యాంకులో పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవాలి. 

 

లోన్ తీసుకునే ముందు అన్ని డాక్యుమెంట్లను కరెక్ట్‌గా చదువుకోవాలి. లేదంటే తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే డాక్యుమెంట్లను ఒకటికి రెండు సార్లు చదువుకోవాలి. 

 

కొన్ని కొన్ని బ్యాంకులు పర్సనల్ లోన్స్‌పై ప్రత్యేక ఆఫర్లు అందిస్తుంటాయి. అలాంటప్పుడు అయితే తక్కువ వడ్డీకే రుణాలు లభించొచ్చు. 

 

చూశారుగా.. ఈ జాగ్రత్తలు అన్ని పాటించి పర్సనల్ లోన్ తీసుకోవం మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: