వందకు దగ్గరలో పెట్రోల్, డీజిల్ ధరలు కొనసాగుతున్నాయి. రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. కేవలం 20 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఏకంగా 10 రూపాయిలు పెరిగాయ్. ఇలాగే కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు మరో నెలలో వంద రూపాయిలు చూడాల్సి వస్తుంది. 

 

అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గటం లేదు. ఇంకా నేడు హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా కొనసాగుతున్నాయి. లీటరు పెట్రోల్ ధరకు 45 పైసలు పెరుగుదలతో రూ.83.49కు, డీజిల్ ధర 55 పైసలు పెరుగుదలతో రూ.78.69కు చేరాయి. 

 

IHG

 

ఇంకా ఇలానే అమరావతిలో కూడా కొనసాగుతున్నాయి. నేడు అమరావతిలో పెట్రోల్ ధర 34 పైసలు పెరుగుదలతో 83.97 రూపాయలకు చేరింది. డీజిల్‌ ధర కూడా 19 పైసలు పెరుగుదలతో రూ.78.86కు చేరింది. ఇక విజయవాడలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 25 పైసలు పెరుగుదలతో రూ.83.38కు, డీజిల్ ధర 20 పైసలు పెరుగుదలతో రూ.78.50కు చేరింది. 

 

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి కానీ పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. అయితే కరోనా వైరస్ నియంత్రించేందుకు అమలు చేసిన మూడు నెలల లాక్ డౌన్ లో పెట్రోల్ ధర 73 వద్ద స్థిరంగా కొనసాగింది. కానీ ఇప్పుడు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు స్థిరంగా కొనసాగుతాయి అనేది చూడాలి.                                 

మరింత సమాచారం తెలుసుకోండి: