చైనీస్‌ యాప్‌లకు భారత ప్రభుత్వం షాక్‌ ఇచ్చిన విష‌యం తెలిసిందే. సరిహద్దులో చైనాతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన 59 సంస్థలకు చెందిన యాప్‌లపై నిషేధం విధించింది.  ప్రభుత్వం నిషేధం విధించిన వాటిలో టిక్‌టాక్‌, షేర్‌ ఇట్‌, యూసీ బ్రౌజర్‌, హలో, వీ చాట్‌, బ్యూటీ ప్లస్‌ యాప్స్‌ కూడా ఉన్నాయి. దేశ రక్షణ, భద్రత దృష్ట్యా చైనా యాప్‌లపై నిషేధం విధించినట్టు కేంద్రం వెల్లడించింది.  కాగా, చైనీస్‌ యాప్‌ల వల్ల వినియోగదారుల సమాచారం చోరీకి గురవుతుందనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 

 

మరోవైపు భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో చైనా యాప్‌లను నిషేధం విధించాలని సోషల్‌ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్‌ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చైనా విధించిన యాప్‌ల్లో అత్య‌ధికంగా ఆద‌ర‌ణ పొందిన‌ది టిక్ టాక్‌. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ టిక్ టాక్‌ను భార‌త్‌లో ఉప‌యోగిస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఫేస్‌బుక్ కంటే ఇటీవ‌ల టిక్ టాక్‌కు ఆద‌ర‌ణ పెరిగిపోవ‌డం గ‌మ‌నార్హం. టిక్‌టాక్ యాప్ ఇండియాలో 14 భాషల్లో అందుబాటులో ఉన్నది. షార్ట్ వీడియో సర్వీస్‌ను భారత్‌కు చెందిన లక్షలాది మంది వినియోగిస్తున్నారు. టిక్‌టాక్‌, యూసీ బ్రౌజర్‌, వీచాట్, షేర్ ఇట్‌, కామ్‌స్కానర్ లాంటి చైనా యాప్స్‌ను భారత ప్రభుత్వం నిషేధించింది. 

 

 టిక్‌టాక్ ఆప్ ను నిషేధిస్తూ ప్లేస్టోర్ నుంచి తొల‌గించాల‌ని భార‌త ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసిన నేప‌థ్యంలో ఇండియా టిక్ టాక్ కార్యాల‌య అధికారులు స్పందించారు. ఈ మేర‌కు భార‌త ప్ర‌భుత్వానికి విన‌తి చేశారు. డేటా ప్రైవసీ, సెక్యూర్టీ విషయంలో భారతీయ చట్టాలకు లోబడి ఉన్నట్లు పేర్కొన్నారు.  భారతీయ యూజర్లకు సంబంధించిన సమాచారాన్ని ఇతర విదేశీ ప్రభుత్వాలతో షేర్ చేసుకోలేదని స్ప‌ష్టం చేసింది.  చైనా ప్రభుత్వానికి కూడా తమ సమాచారాన్ని ఇవ్వలేదన్నది. ఒకవేళ ఎవరైనా భవిష్యత్తులో సమాచారం కోరినా.. దాన్ని మేం వ్యతిరేకించేందుకు టిక్‌టాక్ సిద్ధంగా ఉంద‌ని తెలిపింది. యాప్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం అందిందని, వివరణ ఇవ్వాలని ప్రభుత్వం తమను కోరినట్లు టిక్‌టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ ఓ ప్రకటనలో తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: