అవును.. నేడు పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు నిజంగానే గుడ్ న్యూస్ చెప్పాయి. అంత గుడ్ న్యూస్ ఏంటబ్బా అని అనుకుంటున్నారా? అదేనండి.. గత 25 రోజులుగా భారీగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నేడు బ్రేక్ పడింది. పెట్రోల్ ధరలు పెరగకుండా తగ్గకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. 

 

IHG

 

కాగా పెట్రోల్, డీజిల్ ధరల వంద రూపాయలకు చేరే అవకాశం ఉందని అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఎందుకు గత 25 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆగకుండా పెరుగుతూ వచ్చాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే ఈ 25 రోజుల్లో ఏకంగా పది రూపాయిలు పెరిగాయి. అందుకే మార్కెట్ నిప్పులు లీటర్ పెట్రల్ వంద రూపాయలు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. 

 

IHG

 

ఇంకా నేడు హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా కొనసాగుతున్నాయి. లీటరు పెట్రోల్ ధర రూ.83.49 వద్ద స్థిరంగా కొనసాగగా, డీజిల్ ధర రూ.78.69 వద్ద స్థిరంగా కొనసాగాయి. ఇంకా ఇలానే అమరావతిలో కూడా కొనసాగుతున్నాయి. నేడు అమరావతిలో పెట్రోల్ ధర 83.97 రూపాయల వద్ద, డీజిల్‌ ధర కూడా రూ.78.86 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఇక విజయవాడలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. 

 

IHG

 

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధర 80 రూపాయిల వద్ద, డీజిల్ ధర 76 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఇంకా ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మరి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: