భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్ తెలిపింది. చిన్న వ్యాపారులకు సాయమందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ పెట్టుబడులు ఉండనున్నట్లు వెల్లడించింది. సామాజిక మాధ్యమం ఫేస్​బుక్​.. భారత్​ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. సాంకేతిక సామర్థ్యం పెంపు, మౌలిక సదుపాయాల కల్పనతో చిన్న వ్యాపారాలకు ప్రోత్సాహమందించే విధంగా ఈ పెట్టుబడులు ఉండనున్నట్లు ఫేస్​బుక్​ ఇండియా మేనేజింగ్​ డైరెక్టర్​ అజిత్​ మోహన్​ తెలిపారు. ఉద్యోగాల కల్పన కూడా ఈ పెట్టుబడుల ముఖ్య ఉద్దేశమని చెప్పుకొచ్చారు.

 


డిజిటల్ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భారత్​ మిగత అన్ని దేశాలకన్నా ముందు వరుసలో ఉందని అజిత్​ మోహన్ వెల్లడించారు. భవిష్యత్​లో భారత రూపురేఖలను మార్చడంలో ఇది మేలు చేసే అంశమన్నారు.సాంకేతికతను అందిపుచ్చుకోవడం వల్ల పారిశ్రామికంగా ఎన్నో మార్పులు వస్తాయని, ఇది భారత సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీని వల్ల కొత్త ఆవిష్కరణలు, వ్యాపారాలకు అవకాశాలు పెరిగి ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందనన్నారు. ఫలితంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని పేర్కొన్నారు.

 

 

కేవలం ఈ ఫేస్ బుక్ వాడటం కోసం మొబైల్ డేటా ను వాడకం మొదలు పెట్టిన అనేకమంది ప్రజలు.. ఇప్పుడు అదే వాడకం అనేక వెబ్సైట్లను చూసేలా చేసింది. ఫేస్ బుక్ లో వాణిజ్య రంగం కూడా బాగా పెరిగింది.. ఒకప్పుడు దానిని మిత్రులు సమాచార సేకరణ కోసం వాడేవారు. కానీ ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం, కొత్త వ్యక్తులతో పరిచయం పెంచుకోడానికి అనేక వ్యాపార లాభాలు ఏ విధంగా రాబట్టుకోవాలి తెలుసుకోవడానికి ఇప్పుడు ఎక్కువశాతం దీనిని ఉపయోగిస్తున్నారు.ఈ యాప్ వినియోగం ఎంతగా మారిపోయిందంటే స్మార్ట్ ఫోన్  ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరి ఫోన్లో ఈ యాప్ లేకుండా ఉండడం జరగని పని అని చెబితే అది అతిశయోక్తి కాదు. ఇది నమ్మవలసి న  నిజం  దీనిలో అనేక కొత్త రకాల అప్డేట్ రావడం వలన ఉపయోగించే వారి శాతం కూడా ఎక్కువగా పెరుగుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: