మీరు ఇల్లు కట్టుకుని సుఖంగా జీవించాలి అనుకుంటున్నారా..?  కొత్త ఇల్లు కట్టుకుని కుటుంబమంతా హాయిగా జీవించాలని అనుకున్నా  లేదా ఫ్లాట్ లాంటివి  కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా...?  అయితే మీ కలల్ని నెరవేర్చేందుకు  తక్కువ వడ్డీతో బ్యాంకులో రుణం పొందాలంటే ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి.....  చాలా మంది ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటారు. అయితే అంత డబ్బు పెట్టడం కష్టమే. కాబట్టి బ్యాంకులో లోన్ తీసుకుని కట్టుకోవడం కొంచెం సులువైన పని. అయితే దీనికి బ్యాంకు నుండి లోన్ తీసుకుని చేయడం బెటర్ కాబట్టి బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా హోమ్ లోన్స్ ని అందిస్తాయి.

 

 

 లోన్లు ఇచ్చే బ్యాంక్స్ అన్ని కూడా ఒకటే వడ్డీకి లోన్ ని  అందించవు. ఒక్కో  బ్యాంకు ఒక్కో వడ్డీ రేటు తో మీకు అందిస్తుంది.  బ్యాంకులతో పాటు  వడ్డీ రేట్లు కూడా మారిపోతాయి అలాగే చార్జీలు కూడా వేరేగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా బ్యాంక్ లోన్ తీసుకుంటే ఈ అంశాలను మీరు తప్పక గమనించాలి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.7 శాతం నుంచి వడ్డీ రేటు తో హోమ్ లోన్స్ ని అందిస్తుంది. అదే బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే 6.85 శాతం వడ్డీల రుణాలు ఆఫర్ చేస్తోంది ఇదిలా ఉంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇవే వడ్డీతో హోమ్ లోన్ అందిస్తూ ఉన్నాయి.

 


 ఇవన్నీ ఇలా ఉంటే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ , కెనరా బ్యాంక్ 6.9 శాతం వడ్డీ రేట్ల తో  రుణాలు అందిస్తున్నాయి. కోటక్ మహేంద్ర బ్యాంక్ వంటివి మాత్రం 7.35 శాతం వడ్డీ తీసుకుంటున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా 7.3 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. అలానే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ 7 శాతం వడ్డీ రేటు తో లోన్స్  ఆఫర్ చేస్తోంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 7.3 శాతం వడ్డీతో రుణాలు ఇస్తోంది. అలానే నైనీటివ్ బ్యాంక్ హోమ్ లోన్స్ పై 7.4 శాతం వడ్డీ తీసుకుంటోంది. ఐడిబిఐ బ్యాంక్ 7.8 శాతం వడ్డీని వడ్డీ రేటు తో  రుణాలు ఇస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే దిగ్గజ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7 శాతం నుంచి వడ్డీ రేట్లు వసూలు చెయ్యగా ఐసీఐసీఐ బ్యాంక్ 7.45 శాతం వడ్డీ రేట్లతో రుణాలు అందిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: