గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. గ్యాస్ మార్కెటింగ్ విధానంలో సంస్కరణలు తీసురావడానికి రెడీ అవుతోంది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తున్న వారికి ఈ ప్రయోజనం కలుగుతుంది. ఇంకా ఇప్పటికే సంస్కరణలపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ సమీక్ష కూడా నిర్వహించనుంది. 

 

IHG

 

ఇంకా ఈ నేపథ్యంలోనే కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఎల్‌పీజీని కొనుగోలు చేయవచ్చు. ఇంకా 14 కేజీల సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ఇక వినియోగదారులు సిలిండర్ పూర్తి ధరను చెల్లించాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. మొబైల్  ఎల్‌పీజీ వ్యాన్ల ద్వారా గ్యాస్‌ను ఇంటి వద్దకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. 

IHG

 

ఇంకా వినియోగదారుడు తీసుకున్న గ్యాస్‌కు అనుగుణంగానే సబ్సిడీ ధర కూడా వస్తుంది. అయితే ఒక సిలిండర్ కి 650 రూపాయిలు చెల్లించకుండా నచ్చిన అంత ఎల్‌పీజీని సిలిండర్‌కు పట్టించుకోవచ్చు. దీని బట్టి చూస్తే 80 రూపాయిల నుండి 100 రూపాయిల వరకు గ్యాస్ కొనే అవకాశం ఉంది. 

 

IHG

 

ఇంకా ఈ రూల్ అమలులోకి వస్తే వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. దీని వల్ల మన వద్ద ఎంత డబ్బు ఉంటే అంతకు గ్యాస్ కొనుగోలు చెయ్యడానికి సాధ్యం అవుతుంది. ఏది ఏమైనా గ్యాస్ వినియోగదారులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. మధ్యతరగతి వారికీ ఇది మరింత ఉపయోగపడుతుంది.                 

మరింత సమాచారం తెలుసుకోండి: