దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు బ్యాంక్ కు సంబంధించిన కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలి. లేకపోతే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎస్బీఐ కస్టమర్లు ఒక లిమిట్ దాటితే తప్పనిసరిగా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. 20 లక్షల రూపాయల లోపు విత్ డ్రా చేసేవాళ్లకు ఎటువంటి సమస్య ఉండదు కానీ అంతకు మించి విత్ డ్రా చేస్తే మాత్రం సమస్యలు తప్పవు. 
 
20 లక్షలకు మించి విత్ డ్రా చేసిన వాళ్లు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఎవరైనా గడిచిన మూడు సంవత్సరాలుగా ఆదాయపు పన్ను రిటర్నులు చెల్లించకుండా.... సంవత్సరానికి 20 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఎస్బీఐ నుంచి విత్ డ్రా చేస్తే మాత్రం బ్యాంక్ 194ఎన్ సెక్షన్ కింద ఎస్బీఐ బ్యాంక్ నుంచి టీడీఎస్ కట్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్టేట్ బ్యాంక్ తాజాగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. 
 
బ్యాంక్ ఖాతాదారులు 20 లక్షలకు మించి విత్ డ్రా చేస్తుంటే పాన్ కార్డు వివరాలను అందజేయాల్సి ఉంటుంది. గతంలో బ్యాంక్ ఖాతాకు పాన్ కార్డును జత చేసిన వారు మరలా పాన్ కార్డును అందించాల్సిన అవసరం లేదు. 20 లక్షలకు మించి విత్ డ్రా చేసి పాన్ కార్డు లేకపోతే ఆ భారం మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పాన్ కార్డ్ జత చేసి 20 లక్షల లోపు విత్ డ్రా చేసినా ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం ఉండదు. 
 
20 లక్షల నుంచి కోటి రూపాయల వరకు డబ్బు విత్ డ్రా చేస్తే 2 శాతం టీడీఎస్, పాన్ కార్డు ఇవ్వకపోతే 20 శాతం టీడీఎస్ కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కోటి రూపాయలకు పైగా నగదు విత్ డ్రా చేసి పాన్ కార్డు ఉంటే 5 శాతం టీడీఎస్ కట్ అవుతుంది. పాన్ కార్డ్ లేకపోతే మాత్రం 20 శాతం టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: