వారాంతంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనపడటంతో బుధ‌వారం ఉదయం నుంచే మార్కెట్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. దీంతో సాయంత్రం వ‌ర‌కు కూడా అదే ట్రెండ్ కొన‌సాగింది. ట్రేడింగ్ ముగిసే స‌రికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 143 పాయింట్లు నష్టపోయి 36,594 వద్ద ముగిసింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 10768 దగ్గర ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 75.18గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల నేపథ్యంలో మార్కెట్ల సెంటిమెంట్‌ దెబ్బతిందని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.  ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు, గెయిల్‌, టైటాన్‌ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ నష్టపోగా.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్‌, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, భారతి ఎయిర్‌టెల్‌ లాభాలను న‌మోదు చేసుకున్నాయి. 


ఇదిలా ఉండ‌గా డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత ఫార్మా షేర్లకు కలిసొస్తుంది. మనదేశంలో తయారయ్యే ఔషధాలు అధిక స్థాయిలో విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. రూపాయి బలహీనతతో విదేశీ ఎగుమతులు మరింత పెరగవచ్చని మ‌దుపు దారులు భావించారు. దీంతో ఫార్మా షేర్ల కొనుగోలుకు మ‌దుపర్లు ఆస‌క్తి చూపారు. కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ది చేయడంలో, వేగంగా తయారీని పెంచడంలో భారత్‌ కచ్చితంగా కీలకపాత్ర పోషిస్తుందని న‌మ్మిన‌ట్లు విశ్లేష‌కులు పేర్కొన్నారు. శుక్ర‌వారంమిడ్‌సెషన్‌ సమయానికి మార్కెట్‌ నష్టాల‌ను మూట‌గ‌ట్టుకుంది.  ముఖ్యంగా మెటల్‌, బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాల జోరు కొన‌సాగింది. మధ్యాహ్నం 12గంటలకు సెన్సెక్స్‌ 250 పాయింట్లను కోల్పోయి 36,494 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లను నష్టపోయి 10,737 వద్ద కద‌లాడాయి. 


ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో దేశీయ మార్కెట్లు త‌రుచూ ఒడిదుడుకులకు లోన‌వుతున్న విష‌యం తెలిసిందే.ప్రస్తుతం మార్కెట్లో రిస్క్‌ను ఎదుర్కోనే సత్తా కలిగిన ఇన్వెస్టర్లకు మార్కెట్‌ నిపుణుడు అతుల్‌ భోలే 5రంగాల షేర్లను సూచిస్తున్నారు. ఫైనాన్సియల్‌, కెమికల్స్‌, ఫెర్టిలైజర్స్‌, సిమెంట్‌, టెలికాం రంగాల షేర్లు అందులో ఉన్నాయి. ఏడాది నుంచి ఏడాదిన్నర కాలపరిమితి దృష్ట్యా కొనుగోలు చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: