చేతిలో డబ్బులు ఉన్నాయ్. కానీ కరోనా భయంతో వాటిని ఎక్కడ పెట్టాలి అన్న భయం. రాబడి రావాలి.. రిస్క్ ఉండకూడదు అని అనుకుంటున్నారా? అయితే మీకు ఇక్కడ ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఎలాంటి రిస్క్ లేకుండా.. దిగ్గజ బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ రేటును అందిచే బ్యాంకులు ఉన్నాయి. ఇవి ఏకంగా 9 శాతం వడ్డీని అందిస్తున్నాయి. 

 

సాధారణంగా దిగ్గజ బ్యాంకులు అయితే 7 శాతం వడ్డీ ఇస్తున్నాయి.. కానీ ఈ చిన్న బ్యాంకులు ఏకంగా 9 శాతం వడ్డీని ఇస్తున్నాయి. ఈ చిన్న బ్యాంకుల్లో డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే మంచి రాబడిని ఇస్తున్నాయి. ఆ బ్యాంకులు ఏంటి అంటే? 

 

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన బ్యాంకులో ఎఫ్‌డీలపై 4 శాతం నుండి  ప్రారంభమై 7.75 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తుంది. 

 

ఇంకా ఈ బ్యాంకులో 7 రోజుల నుంచి 90 రోజుల ఎఫ్‌డీలపై 4 శాతం, 45 రోజుల నుంచి 90 రోజుల ఎఫ్‌డీలపై 4.5 శాతం వడ్డీని ఆఫర్ ఇస్తుంది. 181 రోజుల నుంచి 364 రోజుల ఎఫ్‌డీలపై 6.5 శాతం, ఏడాది నుంచి 699 రోజుల ఎఫ్‌డీలపై 7.75 శాతం వడ్డీని అందిస్తోంది. 700 రోజుల ఎఫ్‌డీలపై 8 శాతం వడ్డీ వస్తుంది. ఇక ఆపైన కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై 7.75 శాతం వడ్డీని అందిస్తుంది.

 

సన్‌రైజ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో కూడా ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 4 శాతం నుంచి ప్రారంభమై 7 శాతం వరకు వడ్డీ రేట్లు ఇస్తున్నాయ్. ఇక ఆటుపైన ఎఫ్‌డీలపై 9 శాతం వరకు వడ్డీ ఇస్తున్నారు. ఐదేళ్ల ఎఫ్‌డీలపై ఈ వడ్డీ రేటు ఇస్తున్నారు. 

 

ఇక నార్త్ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీలపై 8 శాతం వరకు వడ్డీ ఇస్తుంది. అందుకే దేశ ప్రభుత్వ దిగ్గజ బ్యాంకులు, ప్రైవేట్ దిగ్గజ బ్యాంకుల కంటే కూడా ఈ చిన్న బ్యాంకులే బెస్ట్. 

మరింత సమాచారం తెలుసుకోండి: