కరోనా వైరస్.. ప్రపంచ ప్రజల జీవితాలను ఎలా తారుమారు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఆర్ధికంగా దెబ్బకొట్టింది. ఈ దెబ్బకు ఎంతోమంది ఉద్యోగాలు అన్యాయంగా పోయాయి. దీంతో ఎంతోమంది ప్రజలు ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారు.

 

ఇంకా అలా తీవ్ర ఆర్ధికం ఇబ్బందులు ఎదర్కొనే వారికీ దేశి అతి పెద్ద బ్యాంక్ ఎస్బిఐ శుభవార్త చెప్పింది. సులభంగా రుణాలు అందిస్తున్నట్టు తెలిపింది. కావాలనుకునే వారికీ వెంటనే లోన్ పొందవచ్చు. అయితే ఈ ఫెసిలిటీ కొందరికి మాత్రమే అందుబాటులో ఉంది. కేవలం కొందరికి మాత్రయం ఈ ప్రయోజనం లభిస్తుంది. 

 

ఎస్బిఐ అర్హత ఉన్నవారికి ఆన్లైన్ ద్వారానే రుణాలు అందిస్తోంది. వ్యాపారులకు ఇ-ముద్రా లోన్స్ అందిస్తోంది. అయితే ఈ రుణాల కోసం బ్యాంకుకు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవచ్చు. అయితే ఎక్కువ మొత్తంలో రుణం కావాలంటే మాత్రం బ్యాంకుకు తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంటుంది. 

 

ఎక్కువ మొత్తంలో కావాలంటే స్టేట్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి ఇ-ముద్రా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌కు వెళ్లిన తర్వాత ఎస్‌బీఐ లోన్స్ పై క్లిక్ చేస్తే పలు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో ఇ-ముద్రా లోన్ ఆప్షన్ ఎంచుకోవాలి. అప్పుడే మీకు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇంకా ఈ రుణం పొందటానికి ఏ అర్హతలు ఉండాలో అక్కడ తెలియజేసింది. 

 

ఈ ముద్ర లోన్ కు ఏదైనా వ్యాపారం చేస్తూ ఉండాలి. బ్యాంక్‌లో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉంటే రూ.లక్ష వరకు రుణం పొందొచ్చు. ఇంకా తీసుకున్న ఈ రుణాన్ని ఐదేళ్లలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే రక్షణే 50 వేల రూపాయిలు రుణం పొందే అవకాశం ఉంది. రూ.50 వేలు దాటి లోన్ అయితే బ్యాంక్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: