బ్యాంకులో లోను కోసం తిరిగి తిరిగి అలసిపోయారా ఐతే ఇలాంటి వారికోసమే SBI ఓ గుడ్‌న్యూస్ చెప్పింది.ఇదివరకు బ్యాంకు నుండి రుణం పొందాలంటే తాత ముత్తాతలు కనిపించేవారు లోను తీసుకుని తమ అవసరాలు తీర్చుకోవాలనుకున్న వారు ఈ అవస్దలు పడలేక బయటనుండి ఎంతో కొంత వడ్డీకి ఐనా అప్పుతెచ్చుకుని పనులు కానిచ్చేవారు,అప్పు కోసం బ్యాంకుకు వెళ్ళితే సమయం వేస్టు,అనే భావన మనలో చాలమందికి ఏర్పడింది.అందుకేనేమో ఈ నిర్ణయం తీసుకుందిsbi.ప్రైవేట్ బ్యాంకులో దొరికినంత సులువు కాదు లోను ప్రభుత్వ రంగ బ్యాంక్ లో దొరకడం, సవాలక్ష రూల్స్.దీంతో ప్రభుత్వ బ్యాంకుల నుంచి ఏ విధమైన రుణాలు పొందాలన్నా..బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి.అయితే,ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోన్లు తీసుకునేవారికి గుడ్ న్యూస్ చెప్పింది.



ఇదివరకైతే లోను ప్రాసెస్ పూర్తికావడానికి గంటలతో పాటు ఒక్కోసారి రోజులు కూడ పట్టేవి.కాని ఇప్పుడైతే 59 నిమిషాల్లో లోన్ ప్రాసెస్ పూర్తి చేసి..వారం రోజుల్లోగా ఆయా సంస్థలకు లోన్ మంజూరు చేయనున్నామని తెలిపారు..రానున్న పండుగ సీజన్‌లో లోన్లు తీసుకునేవారిని ఆకర్షించడమే టార్గెట్‌గా పెట్టుకున్న ఎస్బీఐ.హౌసింగ్,వెహికల్ లోన్లను తక్కువ వడ్డీకి ఇవ్వడంతో పాటు రుణాల పరిధిని మరింత పెంచు కోవడానికి ఏకంగా గృహ,వాహన రుణాలను 59 నిమిషాల్లో అందించడానికి ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ ను ప్రారంభించాయి.SBIతో పాటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంకులు  psbloansin59minutes  పోర్టల్ ద్వారా ప్రస్తుతం కోటి రూపాయల వరకు రుణాలను చిన్న,మధ్య స్థాయి వ్యాపారవేత్తలకు అందిస్తుండగా,ఈ పరిధిని రిటైల్ రుణాలకు వర్తించనున్నట్లు బ్యాంకులు ప్రకటించాయి.హౌసింగ్, వెహికల్ లోన్లను కూడా ఈ పోర్టల్ పరిధిలోకి తీసుకురానున్న ట్టు ఎస్బీఐ అధికారులు తెలిపారు.ఇంకేముంది లోనుకావల్సినవారు క్యూ కట్టవలసిన అవసరం లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: