పీవీ సింధు...!! బ్యాడ్మింటన్‌ స్టార్‌ మాత్రమే కాదు. ఇట్స్‌ ఎ బ్రాండ్‌. బ్యాడ్మింటన్‌లోనే కాదు.. బ్రాండింగ్‌లోనూ అదరగొడుతోంది.  ఇంటర్నేషనల్‌ బ్రాండ్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది సింధు‌. క్రికెటర్లు, టెన్నిస్‌, ఫుట్‌బాల్‌ ప్లేయర్స్‌ మాత్రమే చోటు దక్కించుకునే ఫోర్బ్స్‌ జాబితాలోకి సింధూ చేరడమే కాకుండా.. 13 వ స్థానంలో నిలిచింది. వరల్డ్‌ ఛాంఫియన్‌షిప్‌ విక్టరీతో...  బ్రాండ్‌లకే బ్రాండ్‌గా మారింది.  క్రీడా చరిత్రలోనే కాదు.. బ్రాండింగ్‌లోనూ ది బెస్ట్‌గా నిలుస్తోంది సింధు.


పీవీ సింధు... 4 దశాబ్ధాల భారత్‌ కలను సాకారం చేసిన బ్యాడ్మింటన్‌ స్టార్‌‌. ఒలింపిక్స్‌లో రజత పతకంతో చరిత్ర సృష్టించిన సింధు... వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకంతో.. క్రీడా చరిత్ర లో తనపేరును సుస్థిరం చేసుకుంది. తాజాగా బ్రాండ్‌లకే బ్రాండ్‌గా మారింది. ఇండియాలో అత్యంత విలువైన మహిళా అథ్లెట్‌. బ్యాడ్మింటన్‌లోనే కాదు...  బ్రాండింగ్‌లోనూ ది బెస్ట్‌గా నిలుస్తోంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంది తెలుగు తేజం సింధు. వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ విక్టరీతో ఆమె బ్రాండ్‌ వాల్యూ మరింత పెరిగింది.  ఫోర్బ్స్‌ జాబితాలో 13వ ప్లేస్‌లో ఉన్న సింధు... ఇప్పుడు అంతర్జాతీయ కంపెనీల బ్రాండ్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. 


ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంపాదన కలిగిన వారి వివరాలు, అత్యంత ఆదాయం అందుకుంటున్న వారి గురించి ఏటా ఫోర్బ్స్‌  ఓ లిస్ట్‌ని విడుదల చేస్తుంది. లిస్ట్‌లో అత్యంత ఆదాయాన్ని సంపాదిస్తున్న వారిలో ఇండియా నుంచి అధికంగా క్రికెటర్లే ఉంటారు. ఈ జాబితాలోకి తొలిసారిగా బ్యాడ్మింటన్‌ స్టార్‌ సింధూ చేరింది. 13వ స్థానంలో నిలిచి... అత్యధిక ఆదాయం అందుకుంటున్న అథ్లెట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పీవీ సింధు 13వ స్థానంలో ఉండటమేకాకుండా.. విమెన్స్‌ జాబితాలో ఏడో స్థానంలో ఉంది. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ బ్రాండ్స్‌ రూపంలో రోజుకు 2 కోట్ల రూపాయల సంపాదనతో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నాడు. కోహ్లీ తర్వాత... రోజుకు దాదాపు  కోటిన్నర తీసుకుంటూ సెకండ్‌ ప్లేస్‌లో నిలిచింది సింధు. 


చైనాకు చెందిన స్పోర్ట్స్‌ మెటీరియల్‌ సంస్థ.. లీ నీన్గ్‌తో పీవీ సింధు 50 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. మన దేశంలో ఆ సంస్థకు చెందిన ప్రకటనలు అన్నింటిలో సింధూ బ్రాండింగ్‌ చేస్తోంది. 2023 వరకు కాంట్రాక్ట్‌ కుదుర్చుకుంది లీ నీన్గ్‌. ప్రముఖ ఆన్‌లైన్‌ షాపింగ్‌ మంత్రా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, జీఎస్‌టీ, జేబీఎల్‌ ఇయర్‌ఫోన్స్, బ్రిడ్జ్‌స్టోన్‌ టైర్స్,  స్పోర్ట్స్‌ ఎనర్జీ డ్రింక్‌ గట్రోడ్, వైజాగ్‌ స్టీల్స్‌, బూస్ట్‌  వంటి ప్రముఖ బ్రాండ్‌లకు సింధు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ విజయంతో... సింధూ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న కంపెనీలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. తమ మార్కెట్‌ వాల్యూస్‌ కూడా పెరగబోతున్నట్టు హర్షం వ్యక్తం చేస్తున్నారు కంపెనీ యజమానులు. 


థమ్సప్, కోకోకోలా, పెప్సీ, మజా వంటి కూల్‌ డ్రింక్స్‌కి... సింధూ దూరం. అందుకే ఆ కంపెనీల నుంచి భారీ ఆఫర్లు వచ్చినా పక్కన పెట్టేసింది. ఒకానొక సమయంలో కంపెనీల యాజమాన్యాలు సింధు చుట్టూ ప్రదక్షిణలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటివల్ల హాని ఏదైనా ఉంటుందని చెప్పకపోయినప్పటికీ సింధు మాత్రం నిజ జీవితంలో కూడా వాటిని ప్రిఫర్‌ చేయకపోవడమే కారణమంటున్నారు కుటంబ సభ్యులు.


మరింత సమాచారం తెలుసుకోండి: