బంగారం ధరలు భారీగా పెరిగాయి,గత కొన్నాళ్లుగా వీటి ధరల పెరుగుదలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర గురువారానికి 40వేల రూపాయలు దాటింది.వెండి కూడా కిలో 49 వేల రూపాయలకు చేరింది.అయితే బంగారం ధర రికార్డు స్థాయికి చేరడం ఇదే మొదటిసారి.ఇక 2020 జనవరి లేదా దీపావళి నాటికి ధరలు రూ.40,000 మార్క్ చేరు కుంటాయని తొలుత విశ్లేషకులు అంచనా వేశారు.కానీ అలా చెప్పిన పది పదిహేను రోజుల్లోనే రికార్డ్ స్దాయికి చేరుకున్నాయి. గురువారం నాడు పసిడి ధరలు రూ.250 నుంచి 300 పెరిగి ఏకంగా నలభై వేల మార్క్ దాటింది.బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.40,220 పలుకగా.వెండి ధర కూడా రూ.50 వేల మార్క్ సమీపంలో ఉంది.ఇక వెండి రూ.200 పెరిగి కిలో రూ.49,050 వద్ద స్దిరపడింది..



హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 40,300 రూపాయలు,వెండి కిలో 49 వేల రూపాయలు ఉంది. అంతర్జాతీయ లావాదేవీలు,అమెరికా-చైనాల మధ్య వాణిజ్యయుద్ధం జరుగుతున్న నేపథ్యంలో..మదుపర్లు తమ పెట్టుబడులను బంగారం పైకి మళ్లిస్తున్నారు.అందుకే ధర రోజురోజుకి ఇంతలా పెరుగుతోంది.దీంతో సామన్య ప్రజలు బంగారం కొనే మాటే ఎత్తడం లేదు. మరోవైపు గోల్డ్ ధరలు ఎంత పెరిగినప్పటికీ..కొనేవారు కొంటూనే ఉన్నారు.ఇక 18 నెలల్లో దాదాపు బంగారం ధర ఏకంగా రూ.30,000 నుంచి రూ.40,000కు పెరిగింది.ఈ కాలంలో 33 శాతం పెరుగుదల.గ్లోబల్ ఎకనామిక్ సెంటిమెట్స్ కారణంగా పెట్టుబడిదారులు బంగారం వైపు చూస్తున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ (కమోడిటీ రీసెర్చ్) హరీష్ వీ.అన్నారు.



మ్యూచువల్ ఫండ్స్,ఈక్విటీలు,రియల్ ఎస్టేట్,ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి వచ్చే రాబడి కంటే బంగారంపై ఇన్వెస్ట్ చేయడం సురక్షితమని ఇన్వెస్టర్లు భావిస్తున్నారని అంటు న్నారు.2020లో ఔన్స్ బంగారం ధర 2,000 డాలర్లకు చేరుకున్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ప్రస్తుతం 1,542.06 డాలర్లుగా ఉంది. అయితే అమెరికా-చైనా వాణిజ్య చర్చల ఫలితం ఆధారంగా ఈ ధరల పెరుగుదల ఉంటుందని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: