పరిశ్రమలకు ఊతమిచ్చేలా కేంద్రప్రభుత్వం త్వరలో రెండు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ క్రమంలోనే 5 బ్రిలియన్ కోట్ల ఆర్థిక వ్యవస్థ దిశగా అనేక చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ రీఫండ్స్‌ను రానున్న 30 రోజుల్లో క్లియర్‌ చేసేందుకు చర్యలు చేపట్టారు. భవిష్యత్తులో 60 రోజుల్లో రీఫండ్స్‌ను విడుదల చేయాలని అధికారులకు సూచించినట్లుతెలుస్తుంది. వాస్తవానికి వస్తువులు మరియు సేవలపై విధించే గమ్య ఆధారిత పన్ను  ఉత్పత్తి నుంచి అంతిమంగా వినిమయం వరకు అన్ని దశల్లో దీనిని విధించాలన్నది కేంద్రం నిర్ణయం.  మునుపటి దశలలో చెల్లించిన పన్నులను సెటాఫ్ గా చూపించడం జరుగుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే విలువ జోడింపుపైన మాత్రమే పన్ను. అలాగే అంతిమ వినియోగదారుని పైనే పన్ను భారం.




భారీ రుణాలు, మొండిబకాయిలపై పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ వెల్లడించారు. 14 ప్రభుత్వరంగ బ్యాంకులు లాభాలబాటలో పయనిస్తున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు ఇస్తున్న మద్దతును పొడిగిస్తామని తెలిపారు. 
సుపరిపాలన దిశగా బ్యాంకులు తమ సేవల్లో మార్పులు చేసుకోవాలని నిర్దేశించారు. గృహ, వాహనాల, తనఖా రుణాలను 8 ప్రభుత్వ బ్యాంకులు ప్రారంభించాయి. రుణాల రికవరీలో బ్యాంకులు పురోగతి సాధించాయి. ఈ క్రమంలో రుణాల నిర్వహణను బ్యాంకులు సమీక్ష చేస్తాయన్నారు. 
అలహాబాద్‌ బ్యాంకులో ఇండియన్‌ బ్యాంకు విలీనం అవుతుందని..వీటి కలయిక ద్వారా ఐదో అతిపెద్ద బ్యాంకుగా మారుతుందని పేర్కొన్నారు. సిండికేట్‌ బ్యాంకులో కెనరా బ్యాంకు విలీనం కానున్నట్లు చెప్పారు.






ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకు, యూబీఐ ఒకే బ్యాంకుగా ఏర్పడనున్నాయని నిర్మలాసీతారామన్‌ తెలిపారు. తాజా ప్రకటనతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కు తగ్గనున్నట్లు తెలిపారు. విలీనాల తర్వాత దేశంలో అతిపెద్ద బ్యాంకుగా ఎస్ బీఐ, రెండో అతిపెద్ద బ్యాంకుగా పీఎన్ బీ అవతరించనున్నాయని తెలిపారు.పీఎన్‌బీ, ఓబీసీ, యునైటెడ్‌ బ్యాంకులు విలీనం కానున్నాయని తెలిపారు. ఈ 3 బ్యాంకుల కలయికతో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఏర్పడుతుందని నిర్మలాసీతారామన్‌ మీడియా సమావేశంలో చెప్పారు. ఈ బ్యాంకు రూ.17.95 లక్షల కోట్లతో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తుందని తెలిపారు. గతంలో ఎస్ బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడాలో చిన్న చిన్న బ్యాంకులను విలీనం చేసిన కేంద్రప్రభుత్వం ఇప్పుడు మరో 10 బ్యాంకులను విలీనం చేసి..4 అతిపెద్ద బ్యాంకులను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. బ్యాంకింగ్‌ రంగంలో అనేక సంస్కరణలు చేపడుతున్నామని నిర్మలాసీతారామన్‌ స్పష్టం చేసున్నారు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: