తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ మహానగరంగా పెరిగిపోతుంది. ఇక్కడ వాణిజ్య వ్యాపారాలకు కేంద్రంగా మార్చుతుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే గూగుల్ లాంటి కంపెనీలు హైదరాబాద్ లో ముఖ్య కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఎన్ఆర్ఐలతో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ది కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నారు.


స్వీడన్‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ ఫర్నిచర్ రిటైల్ సంస్థ ఇండియాలో తొలి రిటైల్ ఔట్‌లెట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది. సుమారుగా రూ. 500 నుంచి రూ. 600 కోట్ల పెట్టుబడితో ఈ ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేయనుంది. సింగిల్ బ్రాండ్ రిటైల్‌లోకి 100 శాతం ఎఫ్‌డీఐని అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత వస్తున్న తొలి అంతర్జాతీయ కంపెనీ ఐకియానే. ఇందులో భాగంగా తొలి ఔట్‌లెట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించి బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర రావు సమక్షంలో రాష్ట్ర పరిశ్రమల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర ఐకియా ఇండియా సీఈవో జువెన్సియో మాజ్తూ సంతకాలు చేశారు.


ఐకియా స్టోర్స్

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ తొలి రిటైల్ ఔట్‌లెట్ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ కళాకారులు తయారు చేసే నిర్మల్ బొమ్మలు, పెయింట్స్, పెంబర్తి బొమ్మలు, సిల్వర్ ఫిల్గిరి వంటి వాటికి ఈ ఔట్‌లెట్‌లో చోటు కల్పించాల్సిందిగా ఐకియా ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు.సింగిల్ బ్రాండ్ రిటైల్‌లోకి 100 శాతం ఎఫ్‌డీఐని అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత వస్తున్న తొలి అంతర్జాతీయ కంపెనీ ఐకియానే. దేశంలో సుమారుగా రూ. 10,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఐకిమా ముందుకొచ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి: