మనిషి తన అవసరాలకు అనుగుణంగా ఎన్నో కొత్త కొత్త వస్తువులు కనిపెడతూ వస్తున్నాడు..ఈ దశలోనే గ్రహంబెల్ టెలిఫోన్ కనిపెట్టి.. టెలికాం వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. దూరంగా ఉన్న మనుషులతో మాట్లాడుకునే సౌకర్యాన్ని అప్పట్లో కనిపెట్టగా రాను రాను ఈ టెలికాం వ్యవస్థలో ఎన్నో అధునాతనమైన మార్పులు వచ్చాయి. ప్రస్తుం సెల్ ఫోన్ వ్యవస్థ ఎంతో అభివృద్ది చెందింది..ఇక సెల్ ఫోన్ వాడకానికి ముఖ్యమైనది నెట్ వర్క్ ఈ నెట్ వర్క్ లో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి.

తాజాగా 4జీ అందుబాటులో ఉంది. ప్రస్తుతం మనిషి చేతిలో ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచమంతా అతని చేతిలో ఉన్నట్లే. ఇక నెట్ వర్క్ విషయంలో మరిన్ని ప్రయోగాలు చేస్తున్నారు..ఈ నేపథ్యంలోనే అమెరికాలోని టెక్సాస్ స్టేట్ కు చెందిన ఏటీ అండ్ టీ టెలికాం సంస్థ అత్యంత వేగవంతంగా పనిచేసే 5జీ మొబైల్ నెట్ వర్క్ ను పరీక్షించనున్నట్లు తెలిపింది.

ఇక ఇది అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న నెట్ వర్క్ ల కంటే వంద రెట్లు స్పీడ్ గా పనిచేస్తుందన్నారు. ఇంటె,స్విడిష్ నెట్ వర్కింగ్ గ్రూప్ ఎరిక్ సన్ లతో కలిసి ఈ సంవత్సరం చివరి వరకల్లా ప్రయోగాత్మకంగా 5 జీ నెట్ వర్క్ ను పరీక్షిస్తామని తెలిపింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: