గత సంవత్సరం బంగారం,వెండి ధరలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ మద్య కాలంలో ఒక్కసారిగా 25 వేల నుంచి ఒక్కసారిగా చుక్కలనంటాయి. అయితే స్టాక్ మార్కెట్ ను బట్టి బంగారు 29 వేల నుంచి 30 వేల మద్యలో కొనసాగుతుంది. ఈ రోజు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.   బలహీనంగా ఉన్న ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు మందగించడం తదితర కారణాల వల్ల దీని ధర తగ్గిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

అంతర్జాతీయంగా న్యూయార్క్‌ బులియన్‌ మార్కెట్ లో ఔన్సు బంగారం ధర 1,221.80 అమెరికన్‌ డాలర్లుగా ఉంది.  అలాగే శనివారం వెండి ధర కూడా తగ్గింది. రూ.600 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.36,600కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేయకపోవడంతో దీని ధర తగ్గిందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: