మా టీవీ నెట్‌వర్క్ లైసెన్స్ రెన్యూవల్స్‌ను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ నిరాకరించింది. మా టీవీ, మాగోల్డ్, మా మూవీస్, మా మ్యూజిక్ లైసెన్స్‌లను రద్దు చేశారు.


తాజాగా రెన్యువల్ చేసిన లైసెన్స్‌‌ల జాబితా నుంచి మా టీవీ నాలుగు చానెల్స్‌ను కేంద్రం తొలగించింది. మా సంస్థ డైరెక్టర్‌పై ఉన్న ఆర్థిక నేరాల అభియోగాల కారణంతో క్లియరెన్స్‌ను హోంశాఖ సెక్యూరిటీ నిరాకరించింది.


ప్రసారమంత్రిత్వ శాఖ అప్‌ లింకింగ్‌, డౌన్‌ లింకింగ్ నిబంధనలకు అనుగుణంగా కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మా టీవీ చానెల్స్‌ను స్టార్‌గ్రూప్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.




తాజా కేంద్ర నిర్ణయంతో లైసెన్స్‌లను తమ పేరిట మార్చుకునేందుకు స్టార్‌గ్రూప్‌ సిద్ధమైనట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: