భారత దేశంలో బడాబాబులు ఈ మద్య బ్యాంకులు దోపిడి దారులకంటే దారుణంగా దోచుకుంటున్న వైనం చూస్తున్నాం. ఇప్పటికే విజయ్ మాల్యా వేలల్లో బ్యాంకులకు అప్పు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకున్నారు. ఇలాంటి మాల్యాలు దేశంలో ఎంతో మంది ఉండటంతో సేవారంగంలోకి వస్తున్నబ్యాంకులు మద్యలోనే డ్రాప్ అవుతున్నాయి.  తాజాగా   ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(క్యూ1)లో ప్రభుత్వ రంగ సంస్థ ‘దేనా బ్యాంకు’ఫలితాలు విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం పూర్తి స్తాయిలో నష్టాల బాటలో నడుస్తున్నట్లు తెలుస్తుంది.

 1(ఏప్రిల్‌-జూన్‌)లో ఏకంగా రూ. 279 కోట్లమేర నికర నష్టాలు ప్రకటించింది. గత(2015-16) క్యూ1లో రూ. 15 కోట్ల నికర లాభం ఆర్జించింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 9.98 శాతం నుంచి 11.88 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పీఏలు కూడా 6.35 శాతం నుంచి 7.65 శాతానికి ఎగశాయి. మొండిబకాయిలకు ప్రొవిజన్లు రూ. 325 కోట్ల నుంచి ఏకంగా రూ. 665 కోట్లకు జంప్‌చేశాయి.  

అయితే ఫలితాలు ఎలా ఉన్నా పీఎస్‌యూ బ్యాంకు షేర్లకు డిమాండ్‌ ఊపందుకోవడంతో ఈ కౌంటర్ కూడా లాభపడింది. బీఎస్‌ఈలో దేనా బ్యాంక్‌ షేరు 3 శాతం బలపడి రూ. 37.30కు చేరింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: