కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును ప్రకటించి గురువారానికి సరిగ్గా నెలరోజులు గడిచింది. ఈ 30 రోజుల్లో ప్రజలు గతంలో ఎన్నడూ చవి చూడని కష్టాలను చవి చూశారు. తమ అకౌంట్లో డబ్బులు ఉన్నా చేతిలో చిల్లిగవ్వ లేక కాలి కడుపుతో పడుకున్న వారి కొందరైతే, డబ్బుల కోసం ఏటీఎంలు, బ్యాంకుల వద్ద పడిగాపులు కాసిన, కాస్తున్న వారి మరికొందరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరిది ఒక్కో బాధ.