ఎంతో కాలంగా అమెరికా వడ్డీ రేట్ల పెంపుదలపై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. ఎట్టకేలకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచింది. 0.25 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. త్వరలోనే ఒబామా స్థానంలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ట్రంప్ ఆర్థిక విధానాలు ఎలా ఉండబోతున్నాయనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ట్రంప్ ఆర్థిక విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అప్రమత్తపై 0.25 శాతం వడ్డీ రేటు పెంచింది.