గత కొన్ని రోజుల్లో మార్కెట్లో నెట్ వర్క్ ల మద్య సైలెంట్ యుద్దం కొనసాగుతుంది.  ఇక  రిలయన్స్‌ జియో వచ్చినప్పటి నుంచి వినియోగదారులకు ఇస్తున్న సౌకర్యాలు చూస్తుంటే..మిగతా నెట్ వర్క్స్ వారికి గుబులు పుడుతుంది. ఇప్పటికే వొడా,ఐడియా నెట్ వర్క్స్ కొత్త కొత్త ప్యాకేజీలు వినియోగదారులకు అందిస్తున్న నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ కూడా తన కస్టమర్లకు బంపర్‌ ఆఫర్లను ప్రకటిస్తోంది.. తాజాగా ఎయిర్‌టెల్‌ కొత్త బోనస్‌ డేటా ఆఫర్‌ను తన కస్టమర్లకు తీసుకొచ్చింది.
ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్.. రూ.399కే 84 జీబీ డేటా..!
రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన రూ.399 ప్లాన్ మాదిరిగానే ఎయిర్‌టెల్ కూడా ఇవాళ రూ.399 ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్‌తో యూజర్లు రీచార్జి చేసుకుంటే వారికి 84 జీబీ డేటా లభిస్తుంది...దీని వ్యాలిడిటీ 84 రోజులు ఉంటుంది.  అయితే రోజుకు కేవలం 1 జీబీ డేటాను మాత్రమే వాడుకునేందుకు వీలుంటుంది.   ఇలా రూ.1299 ప్లాన్‌కు, రూ.1499, రూ.1799 ప్లాన్లకు 1000జీబీ వరకు బోనస్‌ డేటాను అందించనున్నట్టు ఎయిర్‌టెల్‌ తెలిపింది.

కానీ ఇవన్నీ కొత్త కస్టమర్లకు మాత్రమేనని కంపెనీ వెల్లడించింది. ఇక ఈ ప్లాన్‌లో వారానికి గరిష్టంగా 1000 నిమిషాలు ఉచితంగా లభిస్తాయి. వీటితో లోకల్, ఎస్‌టీడీ కాల్స్ చేసుకోవచ్చు. వారంలో ఉచిత నిమిషాలు అయిపోతే అప్పుడు ఆన్ నెట్ వర్క్ కాల్స్ నిమిషానికి 10 పైసలు, ఇతర నెట్‌వర్క్ కాల్స్ నిమిషానికి 30 పైసలు చార్జి ప‌డుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: