ఇప్పుడు మొబైల్ రంగంలో ఎన్నో మార్పులు చేర్పులు వస్తున్నాయి. కొత్త కొత్త ఫీచర్స్ తో  సామాన్య వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. అదే రీతిలో నెట్ వర్క్ లు కూడా చాలా తక్కువ ధరలకే నెట్, టాక్ టైమ్ సదుపాయం కల్పిస్తున్నారు.  తాజాగా జియో, ఐడియా,ఎయిర్ టైల్, వొడా లాంటి నెట్ వర్క్ సంస్థలు పోటీలు పడీ ధరలు తగ్గిస్తున్నాయి.

బెస్ట్ క్లాస్ మొబైల్ ఫోన్ ఎక్స్‌పీరియన్స్‌..

 తాజాగా ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ తన మొట్టమొదటి క్యూ సిరీస్ స్మార్ట్‌ఫోన్ LG Q6ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది ధర రూ.14,990. హైఎండ్ లుక్‌కు అద్దం పట్టే విధంగా ఫుల్ విజిన్ డిస్‌ప్లే టెక్నాలజీతో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లో బెస్ట్ ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులోకి తెస్తుంది.
7000 సిరీస్ అల్యూమినియమ్ మెటల్
దీని ప్రత్యకతలు..ఎల్‌జీ జీ6 ప్రేరణతో రూపుదిద్దుకున్న LG Q6 స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ధర పాయింట్లోనూ ఫుల్‌విజన్ డిస్‌ప్లే టెక్నాలజీతో రావటం విశేషం. ఈ ఫోన్‌లో ఏర్పాటు 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ ఫుల్‌విజన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ2160 x 1080పిక్సల్స్) యూజర్ వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను కొత్త లెవల్‌కు తీసుకువెళుతుంది. 


ఫీచర్స్ :  LG Q6  క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్  435  చిప్సెట్ , 3GB RAM  కలిగి వుంది , 32GB  స్టోరేజ్ మరియుఈ స్టోరేజ్ ని మైక్రో  SD  కార్డ్  ద్వారా  256GB  వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు . Q6  స్మార్ట్ ఫోన్ లో   ఆటో ఫోకస్ తో పాటుగా  13MP  రేర్ షూటర్ అండ్  LED  ఫ్లాష్ కలదు.   సెల్ఫీ కోసం 5MP  ఫ్రంట్ కెమెరా గలదు .   దీనితో 100  డిగ్రీ వైడ్ యాంగిల్ వరకు   సెల్ఫీ తీసుకోవచ్చు .  కనెక్టివిటీ కోసం , LG Q6, WiFi 802.11 b/g/n, WiFi  డైరెక్ట్ ,  బ్లూటూత్  4.2  తో  A2DP, GPS  తో A-GPS, NFC  మరియు  USB  టైప్ సి పోర్ట్ సపోర్ట్ చేస్తుంది .  ఈ స్మార్ట్ ఫోన్ లో 3000mAh  బ్యాటరీ  గలదు మరియు   ఈ ఫోన్ ఆస్ట్రో బ్లాక్ ,  ఐస్ ప్లాటినం మరియు  టెరా  గోల్డ్ వేరియంట్స్ లో అవైలబుల్ గా  వుంది . 


మరింత సమాచారం తెలుసుకోండి: