సాధారణంగా పండుగలకు, ప్రత్యేకమైన రోజులకు మార్కెట్ లో ఎన్నో వస్తువులకు బోలెడన్ని ఆఫర్లు పెడుతుంటారు. ఇక రేపటి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నోకియా 5 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు ప్రారంభిస్తున్నట్లు హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ తెలిపింది. ఈ మద్య కొత్త ఫీచర్స్ తో ఎన్నో ఫోన్లు రిలీజ్ చేసిన నోయికా సంస్థవారు...ఇప్పుడు నోకియా 5 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్ లో కి ప్రవేశపెట్టబోతుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లను హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోని దుకాణాల్లో విక్రయానికి ఉంచుతున్నట్లు చెప్పింది. మరోవైపు, ఇప్పటికే నోకియా 6 ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమైన విషయం తెలిసిందే.
నోకియా 5 ఫీచర్ :
నోకియా 5 ధర రూ. 12,499
5.2 అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 7.1.
1 నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్
2జీబీ ర్యామ్
16జీబీ ఇంటర్నల్ మెమొరీ
13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా
8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఫీచర్లుగా ఉన్నాయి.