సాధారణంగా కాఫీ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు.  అయితే మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కాఫి అంటే ప్రాణమిచ్చే వారు ఎంతో మంది ఉన్నారు.  ఇక కాఫీ గింజల నుంచి తయారు చేసే కాఫీ పొడి రక రకాల బ్రాండ్ లలో దొరుకుతుంది.   తాజాగా ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ధ‌ర గ‌ల సివిట్ కాఫీ లేదా లువాక్ కాఫీ గింజ‌ల‌ను క‌ర్ణాట‌క‌లోని కూర్గ్ రైతులు ఉత్ప‌త్తి చేయ‌డం ప్రారంభించారు.  ప్రపంచ వ్యాప్తంగా సివిట్ కాఫీ గింజటకు విపరీతమైన డిమాండ్ ఉంది.  కాకపోతే ఇవి ప్రకృతి పరంగా పండే పంట కాదు..సివిట్ అనే పిల్లి జాతికి చెందిన జంతువు మ‌లం నుంచి ఈ కాఫీ గింజ‌ల‌ను సేక‌రిస్తారు.  

సివిక్ అనే నిశాచర జంతువు ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని కొండ ప్రాంతాల్లో క‌నిపిస్తుంటుంది.  దీని ప్రధాన కాఫీ కాయలను మాత్రమే తింటుంది..కాకపోతే కాయ‌ల్లో పై భాగాన్ని జీర్ణించుకోగ‌ల శ‌క్తి మాత్ర‌మే దీనికి ఉంది. జీర్ణ‌క్రియలో భాగంగా మిగిలిపోయిన కాఫీ గింజ‌లు మ‌లం ద్వారా బ‌య‌ట‌కి వ‌స్తాయి.  అలా దాని మలాన్ని సేకరించడం అనేది అంత సులభమైన పని కాదు..కొండ ప్రాంతాల్లో ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి సేకరిస్తారు.  
“Distress”: some civit cats are being kept in cages to produce the coffee
అందుకే ఈ కాఫీ గింజ‌ల‌కు ధ‌ర చాలా ఎక్కువ‌. గ‌ల్ఫ్‌, యూర‌ప్ దేశాల్లో ఈ గింజ‌ల‌తో చేసిన కాఫీకి చాలా డిమాండ్ ఉంది. కేజీ గింజ‌లు రూ. 20000 నుంచి 25000 ధ‌ర ప‌లుకుతాయి.  ప్రస్తుతం భారత దేశంలో కర్ణాట‌క‌లో కొత్త‌గా ఏర్ప‌డిన కూర్గ్ క‌న్సాలిడేటెడ్ క‌మోడిటీస్ సంస్థ ఈ కాఫీ గింజ‌ల ఉత్ప‌త్తిని ప్రారంభించింది.
Image result for civet cat
ప్రారంభంలో 20 కేజీలు ఉత్ప‌త్తి చేసి, గతేడాది 200 కేజీల వ‌ర‌కు ఈ కాఫీ గింజ‌ల‌ను ఉత్ప‌త్తి చేసిన‌ట్లు స‌హ‌వ్య‌వ‌స్థాప‌కుడు న‌రేంద్ర హెబ్బార్ తెలిపారు. స్థానికంగా ఈ కాఫీ గింజ‌ల‌ను `ఐన్మ‌నే` పేరుతో కేజీకి రూ. 8000 చొప్పున అమ్ముతున్న‌ట్లు న‌రేం ద్ర చెప్పారు.

Image result for civet cat


మరింత సమాచారం తెలుసుకోండి: