గత కొన్ని రోజులుగు పడుతూ..లేస్తూ ఉన్న స్టాక్‌మార్కెట్లు ఈ రోజు రికార్డు స్థాయి లాభాల‌తో ముగిశాయి. 200 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 32,663 వద్ద ముగిసింది. 63 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ 10,230 వ‌ద్ద స్థిర‌ప‌డింది.   గతవారం వెలువడిన ద్రవ్యోల్బణ గణాంకాలు సానుకూలంగా ఉండటంతో.. వారం ప్రారంభమైన ఈ రోజు మదుపర్లు కొనుగోళ్ల వైపు అడుగులు వేశారు.
Image result for stock market india
దీంతో ఈ రోజు (సోమవారం) లాభాల్లో ప్రారంభమైన నిఫ్టీ తొలిసారిగా 10,200 మైలురాయిని దాటేసింది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 200 పాయింట్ల లాభంతో 32,633 వద్ద, నిఫ్టీ 63 పాయింట్ల లాభంతో 10,230 వద్ద స్థిరపడ్డాయి. 
Image result for stock market india
టాప్ గెయిన‌ర్స్‌: జేఎమ్.ఫైనాన్షియ‌ల్ లిమిటెడ్‌, ఒబెరాయ్ రియాల్టీ, ఫెడెర‌ల్ బ్యాంక్‌, గుజ‌రాత్ గ్యాస్‌, ఐడియా సెల్యూలార్ లిమిటెడ్‌  లూజ‌ర్స్‌:  స‌న్ ఫార్మ అడ్వాన్స్‌డ్‌,  యూనిటెక్ లిమిటెడ్‌,  బ‌జాజ్ ఫైనాన్స్‌,  రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్‌టెల్‌‌తో పాటు పలు బ్యాంకింగ్ రంగ షేర్లు రాకెట్‌లా దూసుకెళ్లి మదుపర్లకు లాభాల పంట పండించాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: