ఈ రోజు  సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 108.94 పాయింట్లు పెరిగి 0.33 శాతం లాభంతో 33,266.16 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 40.60 పాయింట్లు పడిపోయి 0.39 శాతం నష్టంతో 10,363.65 పాయింట్ల వద్దకు చేరాయి.రంభం నుంచే లాభాల్లోకి వెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ సూచికలు, ఓ దశలో లాభాల స్వీకరణతో కాస్త తడబడినా, చివరికి ఆల్ టైం రికార్డు ముగింపును నమోదు చేసి సరికొత్త రికార్డులు లిఖించాయి.

లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1,43,93,153 కోట్లకు పెరిగింది. బీఎస్ఈలో మొత్తం 2,825 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1703 కంపెనీలు లాభాలను, 977 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.

బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1.13 శాతం లాభపడింది. ఎన్ఎస్ఈ-50లో 30 కంపెనీలు లాభాల్లో నడిచాయి.  డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 64.83 వద్ద కొనసాగుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: