సమాజంలో గౌరవంగా ఉండాలంటే..ఈ కాలంలో మినిమం ఓ సొంత ఇల్లు ఉండాలి.  అయితే ఈ మద్య సగటు మనిషికి వచ్చే సంపాదన ఒకేసారి కూడబెట్టి ఇల్లు కట్టడం అనేది ఊహకందని విషయంగా ఉంటుంది. ఇక మన సంపాదన బట్టి ఇంటి నిర్మాణం కోసం అనేక బ్యాంకులు హౌజింగ్ లోన్ ఇస్తున్నారు.  తాజాగా గృహ రుణాలు ఆశిస్తోన్న వారికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శుభ‌వార్త తెలిపింది.

గృహ‌రుణ వడ్డీరేట్ల‌ను త‌గ్గిస్తున్నామ‌ని, ఈ నిర్ణ‌యం రేప‌టి నుంచే అమ‌లులోకి వ‌స్తుంద‌ని పేర్కొంది. మార్జినల్‌కాస్ట్‌ లెండింగ్‌ రేటు (ఎంసీఎల్‌ఆర్‌) 5 బేసిస్ పాయింట్లకు త‌గ్గిస్తున్న‌ట్లు తెలిపింది.

10 నెలల్లో ఎస్‌బీఐ తొలిసారి ఈ రేటును తగ్గించింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు 8 శాతంగా ఉన్న వార్షిక ఎంసీఎల్‌ఆర్ 7.95 శాతానికి త‌గ్గింది.  టీవ‌ల ఇత‌ర బ్యాంకులు కూడా ఇదే గృహ రుణాల వ‌డ్డీరేట్ల‌ను త‌గ్గించిన విష‌యం తెలిసిందే.             


మరింత సమాచారం తెలుసుకోండి: