గ్లోబల్‌ దిగ్గజం మూడీస్‌ ఇన్వెస్టర్‌ దేశ సావరిన్‌ రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ చేయడంతో మార్కెట్లు మహా జోరుతో కొనసాగాయి. ఇటు ప్రభుత్వ రంగ, అటు ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో కొనుగోళ్లు ఊపందుకోవడంతో నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌ సరికొత్త రికార్డు స్థాయికి ఎగిసింది.  నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు, భారత మార్కెట్ ను ఆకర్షణీయంగా మార్చాయని చెబుతూ, ప్రస్తుతమున్న 'బీఏఏ3' రేటింగ్ ను 'బీఏఏ2'కు పెంచుతున్నట్టు ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజన్సీ 'మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్' ప్రకటించింది.  ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 236 పాయింట్లు ఎగబాకి 33,343కు పెరిగింది. నిఫ్టీ 69 పాయింట్లు పెరిగి 10,284కు చేరుకుంది.\


బీఎస్ఈ లో ఇవాల్టి టాప్ గెయినర్స్...
శ్రీ రేణుకా షుగర్స్ (13.85%), గతి లిమిటెడ్ (9.83%), జుబిలెంట్ లైఫ్ సైన్సెస్ (9.51%), అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (8.01%), పొలారిస్ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ (7.39%).
టాప్ లూజర్స్...
వీడియోకాన్ (-2.73%), టెక్ మహీంద్రా (-2.71%), ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ (-2.69%), గుజరాత్ పిపావావ్ పోర్ట్ (-2.64%), బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ (-2.54%). 


మరింత సమాచారం తెలుసుకోండి: