భారత దేశంలో గత కొంత కాలంగా ద్విచక్ర వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి.  సగటు మనిసి సైతం తన అవసరాల నిమిత్తం ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేస్తున్నారు.  దీంతో భారత దేశంలో గెర్ లెస్ వాహనాలైన హోండా యాక్టివా స్కూటీ  బాగా గిరాకీ పెరిగిపోయింది.  హోండా యాక్టివా స్కూటీ ఏడాది కాలంలో రికార్డు స్థాయిలో అమ్ముడ‌యింది.

కేవలం ఈ ఏడాది ఏడు నెలల కాలంలోనే 20 లక్షల యాక్టివా స్కూటర్స్‌ను విక్రయించటం ద్వారా ఈ ఘనతను సాధించినట్లు హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎంఎ్‌సఐ) వెల్లడించింది.  2017 ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ మధ్య కాలంలో 20,40,134 యాక్టివాలు విక్రయించినట్టు పేర్కొంది.

2001లో యాక్టివాను ఆవిష్కరించిన‌ప్పుడు తొలి 20 లక్షల యూనిట్ల విక్రయానికి కంపెనీకి ఏడేళ్లు పట్టింది. 2008లో ఈ మైలురాయిని అధిగమించింది. ఏడు నెలల్లోనే 20 లక్షల యూనిట్లు విక్రయించడంపై సంస్థ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ ఉపాధ్యక్షుడు యద్‌విందర్‌ సింగ్‌ గలేరియా ఆనందం వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: