చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ మేకర్ షియోమీ ఐఫోన్ టెన్‌కు గట్టి పోటీ ఇచ్చే ఫోన్‌తో వచ్చేస్తోంది. ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ల విషయంలో ప్రత్యర్థులతో పోటీ పడలేకపోతున్న షియోమీ ఎంఐ 7 పేరుతో సరికొత్త ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.  షియోమీ ఎంఐ7 పేరుతో సరికొత్త ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.

ఎడ్జ్ టు ఎడ్జ్ ఓలెడ్ డిస్‌ప్లే, డ్యూయల్ కెమెరాతో వస్తున్న ఇది ఐఫోన్ టెన్, వన్‌ప్లస్ 5టీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. జనవరిలో ఫోన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. 

ఎడ్జ్ టు ఎడ్జ్ ఓలెడ్ డిస్‌ప్లే, డ్యూయల్ కెమెరాతో వస్తున్న ఇది ఐఫోన్ టెన్, వన్‌ప్లస్ 5టీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. జనవరిలో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. లీకైన వివరాలను బట్టి ఎంఐ 7 స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి. 

6.01 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లే, క్వాల్‌కామ్ నెక్స్ట్ జనరేషన్ స్నాప్‌డ్రాగన్ 845 చిప్‌సెట్, 6జీబీ ర్యామ్, 16 ఎంపీ రియర్ డ్యూయల్ కెమెరా, 3350 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్ తదితర ఫీచర్లు ఉన్న ఎంఐ 7 ధర రూ.26,600 ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: