మొబైల్ రంగంలో ఎన్నో పెను మార్పులు తీసుకు వచ్చిన జియోఇప్పుడు వినియోగదారులకు మరిన్ని సేవలు అందిస్తుంది. దీంతో ఈ నెట్ వర్క్ తో పోటీ పడుతూ ఇతర్ నెట్ వర్క్ లు కూడా రేట్స్ తగ్గిస్తూ వచ్చాయి. తాజాగా ఇప్పుడు జియోకి పోటీగా ఎయిర్ టెల్ ఇండియా సిద్ధమైపోతుంది. అత్యంత తక్కువ ధరలో మరో 4జీ స్మార్ట్‌ఫోన్‌ ఇంటెక్స్‌ ఆక్వా లయన్స్‌ ఎన్‌1ను లాంచ్‌ చేసింది.


రూ.1,649కే ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇంటెక్స్‌ భాగస్వామ్యంలో ఎయిర్‌టెల్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.  డేటా, వాయిస్ కాల్స్ ఆఫ‌ర్ల‌తో కూడిన మూడు స‌రికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్ల‌ను అందుబాటు ధ‌ర‌కే అందించేందుకు ఇరు కంపెనీలు ప్ర‌య‌త్నిస్తున్నాయి.

ఆక్వా ల‌య‌న్స్ ఎన్ 1, ఆక్వా ఏ4, ఆక్వా ఎస్‌3 పేరిట ఈ మోడ‌ళ్ల‌ను త‌యారు చేయ‌నున్నారు. నిజానికి వీటి ధ‌ర వ‌రుస‌గా రూ. 3,799, రూ. 4,999, రూ. 6,649. కానీ ఎయిర్‌టెల్ క్యాష్‌బ్యాక్‌తో క‌లిపి తీసుకుంటే కనిష్టంగా రూ. 1,649 ప‌డుతుంది.ఈ క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ వ‌ర్తించాలంటే వ‌రుస‌గా 36 నెల‌ల‌పాటు ఎయిర్‌టెల్‌లో రూ. 169తో రీచార్జీ చేసుకోవాలి. అప్పుడు మొద‌టి 18 నెల‌ల త‌ర్వాత రూ. 500 క్యాష్‌బ్యాక్‌, త‌ర్వాతి 18 నెల‌ల‌కు రూ. 1000 క్యాష్‌బ్యాక్ వ‌స్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: