కొత్త సంవత్సరంలో మారుతి కార్ల ధరలు పెరగనున్నాయి.  కార్ల ప్రియులకు మారుతీ సుజుకీ షాకిచ్చింది. ధరలు పెంచబోతున్నట్లు బాంబు పేల్చింది.మెడల్ ను బట్టి పెరిగిన ధరలు రెండు శాతం వరకు ఉంటాయని మారుతి ప్రతినిధులు చెప్పారు. విడి భాగాల ధరలు బాగా పెరిగాయని... కొంత స్థాయి వరకు ఈ భారాన్ని కంపెనీయే భరించిందని... ఇప్పుడు ఈ భారం మరింత పెరగడంతో, ఆ భారాన్ని కొనుగోలుదార్ల మీద వేయక తప్పడం లేదని వెల్లడించారు.

దేశంలోనే అతిపెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకీనే, అంతేకాకుండా ఎక్కువ మంది ఉపయోగించేది కూడా ఈ కార్లనే. అలాంటిది వచ్చే ఏడాది జనవరి నుంచి ఆయా మోడళ్ల కార్లపై 2 శాతం ధరలు పెంచబోతున్నామని, ఇందుకు ముడిసరుకుల ధరలు పెరగడమే కారణమని తెలిపింది. గత కొన్ని నెలలుగా ముడిసరకుల ధరలు పెరుగుతున్నాయని, ఇప్పటికే తాము ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నామని కంపెనీ వెల్లడించింది. 
Image result for maruthi cars
జనవరి నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. మరోవైపు, కొత్త ఏడాదిలో ధరలు పెంచుతున్నట్టు టాటా మోటార్స్, ఫోర్డ్, హోండా, టయోటా, స్కోడా, ఇసుజు కంపెనీలు కూడా ఇప్పటికే ప్రకటించాయి. మరోవైపు వచ్చే ఏడాది నుంచి ధరలు పెంచనున్నామని ఇప్పటికే టాటా మోటార్స్‌, ఫోర్డ్‌, టయోటా, హోండా, స్కోడా, ఇసుజు కంపెనీలు ప్రకటించాయి


మరింత సమాచారం తెలుసుకోండి: