2017లో చివరి ట్రేడింగ్ సెషన్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. సెన్సెక్స్ 34 వేల పాయింట్లకు ఎగువునకు చేరగా...నిఫ్టీ 10,500 పాయింట్లను అధిగమించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభపడగా...నిఫ్టీ 50 పాయింట్లు లాభపడింది. . లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు, లాభాలతో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్‌ నుంచి లాభపడుతూ వచ్చిన మార్కెట్లు, చివరికీ మంచి లాభాలను అందుకున్నాయి.
Image result for stock market
సెన్సెక్స్‌ చివరిలో 200 పాయింట్లు అధిగమించి, 209 పాయింట్ల లాభంలో 34,057 వద్ద ముగిసింది. నిఫ్టీ 53 పాయింట్ల ర్యాలీ జరిపి 10,530.7 వద్ద క్లోజైంది. అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ ఆస్తులను రిలయన్స్‌ జియో దక్కించుకోబోతుందన్న వార్తలతో ఆర్‌కామ్‌ షేర్లు భారీగా ర్యాలీ కొనసాగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 200 పాయింట్ల లాభంతో 34048 పాయింట్ల దగ్గర కొనసాగుతుండగా...నిఫ్టీ కూడా 50 పాయింట్ల లాభంతో 10,528 పాయింట్ల దగ్గర ట్రేడ్ సాగిస్తోంది. 
బ్యాంకింగ్, ఐటీ, ఆటో, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐడియా సెల్యూలర్, టాటా మోటార్స్, టీసీఎస్ షేర్లు భారీ లాభాలు ఆర్జించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: