గత కొంత కాలంగా భారతీయ టెలికాం రంగంలో పెను మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా రిలయన్స్‌ జియో ఎంటర్ అయినప్పటి నుంచి ఎన్నో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తూ వస్తుంది. వినియోగదారులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఇస్తుండటతంతో..చాలా మంది ఆ నెట్ వర్క్ పైనే దృష్టి పెడుతున్నారు.  దీంతో దేశీయ టెలికాం సంస్థంలు భారతి ఎయిర్‌టెల్‌, ఐడియా, వొడా ఫోన్ కూడా జీయో బాట పడుతున్నాయి. 
Image result for jio airtel
ముఖ్యంగా  టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ కూడా తన రీచార్జ్‌ ప్లాన్లలో మార్పులు చేర్పులు చేస్తుంది.  ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్లాన్ల చెల్లుబాటును పొడిగిస్తూ అప్‌డేట్‌ చేసింది. తద్వారా ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ కస్టమర్లకు అదనపు డేటా ప్రయోజనాలను అందిస్తోంది.   రూ. 448, రూ.509 ప్రీపెయిడ్‌ రీచార్జ్‌లపై ఈ అదనపు  ప్రయోజనాలను  వెల్లడించింది. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం ప్రకారం రూ.448 ప్లాన్‌  వాలిడిటీని  70 రోజుల నుంచి 82 రోజులకు పెరిగింది. 
Image result for jio airtel
రూ. 509 ప్రణాళిక  84 రోజుల బదులుగా ఇకపై 91 రోజులు పాటు  చెల్లుతుంది. ఈ  మార్పులు అన్ని ప్రీపెయిడ్ ఎయిర్టెల్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, వింక్‌మ్యూజిక్ ,  ఎయిర్టెల్ టీవీ   ఆప్‌ చందా వంటి ఇతర ప్రయోజనాలు ఈ పథకంలోనే  లభిస్తాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: