కేంద్రం బడ్జెట్ 2018 ప్రవేశ పెట్టినప్పటి నుంచి స్టాక్ మార్కెట్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.  భారతీయ స్టాక్ మార్కెట్ల పతనం వరుసగా ఏడో రోజు కూడా కొనసాగింది. అమెరికా మార్కెట్లు కొంత కోలుకున్న నేపథ్యంలో, మన దేశీయ మార్కెట్ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. నిన్న దయం లాభాలతోనే ప్రారంభమయ్యాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగింది.
Image result for stock market india
అయితే ఆ జోరు ఆ తర్వాత కొనసాగలేకపోయింది. ఆర్బీఐ పాలసీ రివ్యూ ఉండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. చివరకు మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.  ఈ రోజు   స్టాక్ మార్కెట్ల పతనానికి ఈ రోజు బ్రేక్ పడింది. ఎట్టకేలకు సెన్సెక్స్, నిఫ్టీలు ఈ రోజు లాభాలను నమోదు చేశాయి. ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ మినహా హెల్త్ కేర్, రియాల్టీ, ఫార్మా తదితర సూచీలన్నీ గ్రీన్ లో ముగిశాయి.   ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 330 పాయింట్ల లాభంతో 34,413కు పెరిగింది. నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి 10,577 వద్ద క్లోజ్ అయింది.

Image result for stock market india

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (10.72%), డెన్ నెట్ వర్క్స్ లిమిటెడ్ (8.75%), జీహెచ్సీఎల్ (8.51%), సిప్లా (7.83), భారత్ ఫోర్జ్ (7.73).

టాప్ లూజర్స్:
హెక్సావేర్ టెక్నాలజీస్ (-5.07%), వక్రాంజీ లిమిటెడ్ (-4.99%), స్వాన్ ఎనర్జీ లిమిటెడ్ (-4.47%), జుబిలెంట్ లైఫ్ సెన్సెస్ (-3.79%), యుఫ్లెక్స్ (-3.61%)          


మరింత సమాచారం తెలుసుకోండి: