దినదిన ప్రవర్ధమానమౌతున్న న్యూస్ హంట్ నేడు డైలీహంట్ గా కొత్త రూపాన్ని సంతరించుకుని పూరోగమిస్తూ నెలకు 80 మిలియన్ల యాక్టివ్ యూజర్స్ తో ప్రాంతీయ వార్తా వినోద అంతర్జాల వ్యవస్థ గా మారింది. తమ వ్యాపార పరిధిని విస్త్రుతం చెసుకునే ప్రణాళికలో బాగంగా దీని వ్యవస్థాకుడు అధినేత బాంగళూరుకు చెందిన వీరెంద్ర గుప్త నూతన నియామకాలు చేపట్టారు. పాఠకులు ఫాలోయర్స్ వ్యాపార ప్రకటనలు ప్రచార వ్యవహారాల ప్లాట్-ఫాం గా డైలీహంట్ తీర్చిదిద్దే కార్యక్రమం లో గతంలో "ఫేస్ బుక్ ఇండియా అండ్ సౌత్ ఏషియా చీఫ్ గా పనిచేసి, అడోబ్, ఇంటూయిట్, సయాంటిక్ లాంటి బహుళ జాతి సంస్థల్లో వ్యాపారాలను విస్త్రుత పరచి తన సామర్ధ్యాన్ని ఋజువు చేసుకున్న "ఉమాంగ్ బేడి" ని తన డైలీహంట్ కు నూతన అధ్యక్షునిగా నియమించటం జరిగింది.

Image result for Daily hunT virendra gupta umang beDi

ఉమాంగ్ బేడి


ప్రెసిడెంట్ ఉమాంగ్ బేడి,  వ్యవస్థాపకుడు వీరెంద్ర గుప్త కు వృత్తి రీత్యా రిపోర్ట్ చేయనున్నారు. ఒక "ప్రాంతీయ బాషా అంతర్జాల సంస్థ" ఇంత ప్రఖ్యాత స్థాయి ప్రొఫైల్ ఉన్న వృత్తి నిపుణ్ణి నియమించుకోవటం భారత్ లో ఇదే తొలిసారని అంటున్నారు. అంటే ఈ రకంగా ధైర్యం చేయటానికి కారణం వారి పక్కా వ్యాపార ఆదాయ విస్త్రుత ప్రణాళికే. మూడు మెట్రిక్స్ లో వారు అద్భుతంగా దృష్టి పెట్టనున్నారు. తమ లక్ష్యాన్ని సాధిన్చుకోవటానికి వారు నిర్దేసించుకొన్న అంశాలు ఇవే: 


1. యూజర్స్ సంఖ్యను విస్త్రుతంగా అవధులు లేకుండా కార్పెట్-బాంబింగ్ విధానంలో మార్కెటింగ్ చేయటం 


2. పాఠకులు, ఫాలోయర్స్ పెంచిన దరిమిలా పెరగనున్న రెవెన్యూ సమగ్రత తో దృష్టి పెంచి అత్యధిక లాభదాయకతను నమోదు చేయటం


3. అడ్వర్టైజ్మెంట్ లాంటి వ్యాపార ప్రకటనలు మొదలైన వాటి ని క్రాస్ మార్కెటింగ్ ద్వారా వ్యాపార ప్రచార వాటా దశ దిశను మార్చుకొని స్వతంత్ర ప్లాట్-ఫాం గా తీర్చిదిద్దటం.



వీరెంద్ర గుప్త ప్రకారం అసలు బేడి ప్రత్యేకత ఎమంటే ఆయన వందల మిలియన్ దాలర్లలో వ్యాపారాభివృద్ధి చేయటానికి ఇబ్బడి ముబ్బడిగా కాక వందల వేల రెట్లలో వ్యాపారాభివృద్ది కోసం "సోషల్ మీడియా కంటెంట్ ను తగినవిధంగా మెరుగు పరచటం, ఉపయోగించుకోవటం ద్వారా సాధించిన అనుభవమే" అలాగే పెద్ద సంస్థలను ఢీకొనటానికి మంచి సమర్ధత ఉన్న ఎక్జెక్యూటివ్స్ తయారు చేయటం ఆయన లోని మరో సుగుణం. భారతీయ అడ్వర్టైజ్మెంట్ మార్కెట్ ను  కనీసం 10% అతి తక్కువ కాలంలో చేజిక్కించుకోవటం. 

Image result for Dailee hunT veerendra gupta

వీరెంద్ర గుప్త


సెర్చ్ ఇంజిన్ జయింట్స్ ఐన గూగుల్, ఫేస్-బుక్ ల వాటా ఇప్పుడు ఈ విభాగంలో 80-85% గా నమోదైంది. దీనికోసం  స్థానిక  బాషలలో ప్రవేసించటానికి  తగిన కొత్త ప్రోడక్ట్స్ సిద్ధంచేయబోతున్నట్లు వీరెంద్ర గుప్తా చెపుతున్నారు ఆయన మాటల్లో ఆయన ఆత్మవిశ్వాసం కృతనిశ్చయం కనిపిస్తుంది. 


"ఇండియన్ లాంగ్వేజెస్ డిఫైనింగ్ ఇండియాస్ ఇంటర్నెట్" పై స్టడీ చేసిన "కెపిఎంజి మరియు గూగుల్"  లెక్కల ప్రకారం భారతీయ అంతర్జాల వినియోగంలో ప్రాంతీయ బాషల వాటా 2021 వరకు 75% వరకు ఉండవచ్చని తెలుస్తుంది. అందుకే డైలీహంట్ భారతీయ సంస్థ గా ఈ మార్గంలో తొలి అడుగు వేయటం ముదావహమైన విషయమే. రానున్న ఐదేళ్ళలో 90% అంతర్జాల యూజర్లు ప్రాతీయ బాషల నుండే ఉద్భవిస్థాయని ఈ సంస్థలు పేర్కొన్నాయి. అంటే  "డైలీహంట్ - ఈ రంగంలో యర్లీ బర్డ్" అన్నది స్పష్ట మౌతూనే ఉంది. భారతీయ బాషల ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 230% వరకు పెరిగి ఆపై 2021 వరకు 536 మిలియన్ల మార్క్ ను దాటే అవకాశాలు పుష్కళంగా ఉన్నట్లు తెలుస్తుంది.     
  

మరింత సమాచారం తెలుసుకోండి: