ఆ మద్య కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థలో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అంత‌ర్జాతీయ ప‌రిస్థితులు, బంగారు న‌గ‌ల‌ దుకాణ‌దారుల‌ నుంచి డిమాండ్ లేక‌పోవ‌డంతో ఈ రోజు బంగారం ధ‌ర 460 రూపాయలు ప‌డిపోయి ప‌ది గ్రాముల ప‌సిడి ధ‌ర రూ.31,390కు చేరింది. గ్లోబ‌ల్ మార్కెట్లో బంగారం ధరలు 1 శాతం త‌గ్గాయి. స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్‌ పడిపోవడంతో పాటు గ్లోబల్‌గా సంకేతాలు ప్రతికూలంగా వస్తుండటంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి.

పారిశ్రామిక యూనిట్లు, కాయిన్‌ తయారీదారుల నుంచి డిమాండ్‌ తగ్గడంతో కేజీ వెండి ధర రూ.250 తగ్గి, రూ.39,300గా నమోదైంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు బలంగా ఉందని.. ఫెడ్‌ పాలసీ రేట్లను క్రమంగా పెంచుతుందని ఫెడరల్‌ రిజర్వు చైర్మన్‌ జీరోమ్‌ పావెల్‌ ప్రకటించడంతో, డాలర్‌కు సెంటిమెంట్‌ బలపడింది.

దీంతో ఎంతో విలువైన ఈ మెటల్‌కి డిమాండ్‌ పడిపోయింది. పారిశ్రామిక వ‌ర్గాలు, నాణేల‌ తయారీదారుల నుంచి డిమాండ్ లేక‌పోవ‌డంతో వెండి ధ‌ర‌లు త‌గ్గిపోయాయి. నాలుగు రోజులు బంగారం, వెండి ధ‌ర‌లు పెరుగుతూ వ‌చ్చి ఈ రోజు అమాంతం ప‌డిపోయాయి.   దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.460 చొప్పున పడిపోయి రూ.31,390గా రూ.31,240గా నమోదయ్యాయి. గత నాలుగు సెషన్లలో బంగారం ధరలు రూ.500 మేర పెరిగాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: