స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు మరింత ప్రియంకానున్నా యి. ఇప్పటికే రుణం తీసుకున్న వారు చెల్లించే నెలవారీ వాయిదా (ఈంఐ)లు పెరగనున్నాయి. డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించిన మరుసటి రోజే రుణాలపైనా వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు గురువారం ఎస్‌బిఐ ప్రకటించింది.  ఎస్బీఐ వ‌డ్డీ రేట్ల‌ను పెంచిన త‌ర్వాత మ‌రో రెండు బ్యాంకులు అదే బాట పట్టాయి. ఐసీఐసీఐ, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ వ‌డ్డీ సైతం అదే త‌ర‌హా నిర్ణ‌యం తీసుకున్నాయి. 


బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లో లిక్విడిటీని లేదా న‌గ‌దు ల‌భ్య‌త‌ను క‌ట్ట‌డి చేయాల‌ని చూస్తున్న క్ర‌మంలో ఎస్బీఐ రిటైల్ డిపాజిట్ల‌కు వ‌డ్డీ రేట్ల‌ను పెంచింది. మార్చి 1 నుంచి ఈ నిర్ణ‌యం అమ‌ల్లోకి వ‌చ్చింది. సాధార‌ణంగా బ్యాంకులు గృహ రుణాల విష‌యంలో ఎంసీఎల్ఆర్ ఆధారిత వ‌డ్డీ రేట్ల‌ను అమ‌లు ప‌రుస్తాయి. ఇప్పుడు ఎస్బీఐ లాగే ఐసీఐసీఐ బ్యాంకు, పీఎన్బీ సైతం ఎంసీఎల్ఆర్ వ‌డ్డీ రేట్ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని 0.15% మేర వ‌డ్డీ రేట్ల‌ను పెంచాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సైతం వ‌చ్చే వారంలో ఇదే త‌ర‌హా నిర్ణ‌యం దిశ‌గా సాగుతుంద‌ని భావిస్తున్నారు. దీంతో రుణాల‌పై అధిక వ‌డ్డీ రేట్లు అమ‌ల‌వుతుంటాయి. పీఎన్బీ వెల్ల‌డించిన దాని ప్ర‌కారం ఎక్కువ శాతం రుణ గ్ర‌హీత‌ల‌కు ప్ర‌స్తుతం 8.60%కే తాము గృహ రుణాల‌ను అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అదే మ‌హిళ‌ల విష‌యంలో అయితే ఈ వడ్డీ రేటు 8.55% గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: