ప్రపంచంలో యాపిల్ కంపెనీకి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.  చాలా హై క్వాలిటీతో ప్రొడక్ట్స్ అందించే యాపిల్ సంస్థ తమ కస్టమర్ల కోసం మరో వినూత్న ప్రయత్నం చేస్తుంది. యాపిల్ మరింత అందుబాటు ధరలోనే 13 అంగుళాల సైజున్న మ్యాక్ బుక్ ఎయిర్ ను ఈ ఏడాది విడుదల చేయనుంది. ఇది ఏప్రిల్-జూన్ క్వార్టర్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.
Image result for యాపిల్ 13 అంగుళాల మోడల్
‘‘యాపిల్ నూతనంగా మ్యాక్ బుక్ ఎయిర్ ను తక్కువ ధరకు ఈ ఏడాది రెండో క్వార్టర్లో విడుదల చేసే అవకాశం ఉంది. దీన్ని త్వరలోనే చూడనున్నాం’’ అంటూ  ప్రముఖ విశ్లేషకుడు, కేజీఐ సెక్యూరిటీస్ కు చెందిన మింగ్ చీ క్యూ మీడియాకు వెల్లడించారు.  మంచి బ్రాండ్ సరసమైన ధర కావడంతో ఎక్కువగా సేల్ అవుతాయని అంచనా.

ఇక మ్యాక్ బుక్ ఎయిర్ ను తొలిసారిగా 2008లో యాపిల్ అప్పటి సీఈవో స్టీవ్ జాబ్స్ విడుదల చేశారు.  2015 నుంచి దీనికి అప్ డేషన్ లేదు..దాంతో 12 అంగుళాల  మ్యాక్ బుక్ ప్రోపై  యాపిల్ కంపెనీ దృష్టి సారించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 13 అంగుళాల మ్యాక్ బుక్ ఎయిర్ కు కాలేజీ విద్యార్థుల్లో మంచి ఆదరణ ఉంది. 128 జీబీ వెర్షన్ ధర 999 డాలర్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: